తెలంగాణ

telangana

దిల్లీలో నేడే బీఆర్​ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభం..

By

Published : Dec 14, 2022, 6:32 AM IST

Updated : Dec 14, 2022, 9:47 AM IST

BRS Party Office inaguration in Delhi: తెలంగాణ తరహా పాలనను దేశవ్యాప్తంగా అందించేడమే లక్ష్యంగా  భారత్‌ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్‌... నేడు దిల్లీలో జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాలకు కార్యాలయ ప్రారంభోత్సవానికి ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు, వివిధ పార్టీలు ఎంపీలు హాజరుకానున్నారు. ఇవాళ నిర్వహించే రాజశ్యామల, నవచండీయాగాల్లో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొననున్నారు.

brs
brs

దిల్లీలో నేడే బీఆర్​ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభం..

BRS Party Office inaguration in Delhi: దేశ రాజధాని దిల్లీలో భారత్‌ రాష్ట్ర సమితి-BRS జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సర్దార్‌ పటేల్‌ రోడ్‌లోని కార్యాలయాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాలకు ప్రారంభించనున్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్‌యాదవ్‌, కుమారస్వామితో పాటు వివిధ పార్టీల ఎంపీలు, నాయకులను ఆహ్వానించారు. తొలుత పార్టీజెండాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరిస్తారని, అనంతరం కార్యాలయాన్ని ప్రారంభిస్తారని భారాసనేతలు తెలిపారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరతారని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు దిల్లీ చేరుకున్నారు.

సోమవారం రాత్రే దిల్లీ చేరుకున్న కేసీఆర్‌ మంగళవారం మధ్యాహ్నం కేంద్ర కార్యాలయానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. మొదటి అంతస్తులోని ఛాంబర్‌ను పరిశీలించి... పలు మార్పులు సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి సూచనలు చేశారు. అంతకు ముందు వసంత్‌విహార్‌లో బీఆర్​ఎస్ కోసం నిర్మిస్తున్న సొంత కార్యాలయ భవనం వద్దకు వెళ్లి.. పనులు పరిశీలించారు. కార్యాలయం లోపల, బయట చేపడుతున్న పనుల వివరాలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి కేసీఆర్‌కి వివరించారు. పార్టీ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం పూజలు మొదలుకాగా.. ఇవాళ నిర్వహించే రాజశ్యామల, నవచండీయాగాల్లో కేసీఆర్‌ దంపతులు పాల్గొననున్నారు.

తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన బీఆర్​ఎస్ నాయకులు కేసీఆర్‌ ఫొటోలు, పార్టీ నినాదాలతో సర్దార్‌పటేల్‌ రోడ్డులో పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటికి అనుమతులు లేవంటూ దిల్లీ నగరపాలక సంస్థ సిబ్బంది తొలగించారు. తెలంగాణ భవన్‌, తుగ్లక్‌ రోడ్డులోని కేసీఆర్‌ నివాసం పలువురు ఎంపీల నివాసాల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.

Last Updated : Dec 14, 2022, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details