తెలంగాణ

telangana

'కర్ణాటక కరవు ప్రాంతమైనందునే బడ్జెట్​లో నిధులు కేటాయించారు'

By

Published : Feb 1, 2023, 9:18 PM IST

Updated : Feb 1, 2023, 10:08 PM IST

BJP Leaders on Union Budget 2023: పెట్టుబడులకు అనుకూలమైన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. స్థిరమైన పాలన, ‌అభివృద్ధితో భారత్‌ ముందుకెళ్తోందన్నారు. కర్ణాటక కరవు ప్రాంతమైనందునే ప్రత్యేక కేటాయింపులు చేశారని... అక్కడి ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ సర్కార్‌ కేంద్రానికి ప్రతిపాదనలు పంపలేదని బండి సంజయ్ ఆరోపించారు.

BJP Leaders
BJP Leaders

BJP Leaders on Union Budget 2023: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2023 బడుగు బలహీన వర్గాలకు ఊతమివ్వడంతో పాటు దేశ ప్రగతికి దోహదపడే విధంగా ఉందని బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు అనుకూలమైన బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టిందని కేంద్రమంత్రి పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. చాలా దేశాలు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయన్న ఆయన.. స్థిరమైన పాలన, ‌అభివృద్ధితో భారత్‌ ముందుకెళ్తోందన్నారు. నెలకు 75 వేల చొప్పున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఈపీఎఫ్‌వోలో 27 కోట్ల మంది అదనంగా చేరారని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

పేద, మధ్య తరగతులకు పెద్దపీట:కర్ణాటక కరవు ప్రాంతమైనందునే కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేశారని.... అక్కడి ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ సర్కార్‌ కేంద్రానికి ప్రతిపాదనలు పంపలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించేలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఉందన్న ఆయన... పేద, మధ్య తరగతులకు పెద్దపీట వేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు ఎంత మేరకు నిధులు మంజూరు చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ బడ్జెట్ అర్థంపర్ధం లేని బడ్జెట్‌గా బండి అభివర్ణించారు.

'కర్ణాటక కరవు ప్రాంతమైనందునే బడ్జెట్​లో నిధులు కేటాయించారు'

'అద్భుతమైన బడ్జెట్​ను ఆర్ధికమంత్రి ప్రవేశపెట్టారు. మోదీ చేసేదే చెప్తారని బడ్జెట్ ద్వారా స్పష్టం అవుతోంది. అభివృద్ధి చెందిన దేశంగా తీర్చి దిద్దేలా బడ్జెట్ ఉంది. దేశాన్ని, ప్రజలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. మంచి బడ్జెట్​ను దేశ ప్రజలకు అందించిన మోదీకి కృతజ్ఞతలు. కర్ణాటక కరువు ప్రాంతంగా చూపారు.. కాబట్టి నిధులు కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందా ? బీఆర్ఎస్ ముందు తెలంగాణ రైతులకు రుణమాఫీ చేసి వారిని ఆదుకోవాలి.'-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

దేశ ప్రగతికి దోహదపడే విధంగా బడ్జెట్:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2023 బడుగు బలహీన వర్గాలకు ఊతమివ్వడంతోపాటు దేశ ప్రగతికి దోహదపడే విధంగా ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో చేసిన కేటాయింపులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు 20లక్షల కోట్ల రుణాలు ఇవ్వడంతో పాటు శ్రీ అన్న పథకం ద్వారా చిరు ధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహం ఇస్తూ హరిత అభివృద్ది వైపు నడిపించే నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

బడ్జెట్ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ :కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు... బీజేపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 3 నుంచి 10 వరకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలువేసి సమావేశాలు నిర్వహించి... జాతీయ నేతలు పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతి జిల్లా కేంద్రంలో వివిధ వృత్తులవారితో సహా బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 1, 2023, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details