తెలంగాణ

telangana

BJP MEETING: పార్టీ ముఖ్య నేతలతో నేడు బండి సంజయ్​ సమావేశం

By

Published : Apr 12, 2022, 4:53 AM IST

BJP MEETING: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ నేడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత విజయవంతంపై చర్చించనున్నారు.

BJP MEETING: పార్టీ ముఖ్య నేతలతో నేడు బండి సంజయ్​ సమావేశం
BJP MEETING: పార్టీ ముఖ్య నేతలతో నేడు బండి సంజయ్​ సమావేశం

BJP MEETING: భాజపా రాష్ట్ర పదాధికారులు, జాతీయ నాయకులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేడు సమావేశం కానున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత విజయవంతంపై చర్చించనున్నారు.

ఈ నెల 14న అంబేడ్కర్‌ జయంతి రోజున ప్రారంభమయ్యే రెండో విడత పాదయాత్ర కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. మొదటి విడత పాదయాత్ర కంటే.. రెండో విడత యాత్రను మరింత విజయవంతం చేయడం, పాదయాత్రలో అనుసరించాల్సిన వ్యూహాలు, పాదయాత్రకు మద్దతుగా వచ్చే జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులకు సంబంధించిన ఏర్పాట్లపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర పాటల సీడీని సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి విడుదల చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details