తెలంగాణ

telangana

Bandi Sanjay Fires on Congress : 'బీజేపీ నుంచి ఎవరూ వెళ్లరు.. 'మునిగిపోయే నావ'లో వెళ్లేవారిని ఆపేది లేదు'

By

Published : Jun 23, 2023, 3:58 PM IST

Bandi Sanjay Fires on Congress Party : కేంద్రమంత్రులతో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భేటీ కావడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అలాగే కేటీఆర్ ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇటీవల రేవంత్​రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరి మానసిక స్థితి ఏంటో ప్రజలకు తెలుసు అన్నారు.

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay Fires on BRS Government : రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఈ ఏడాదిలో జరగనున్న శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి మరోమారు ఆశీర్వదించాలని అధికార పార్టీ ప్రజానీకాన్ని కోరుతుండగా.. సర్కార్ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా విపక్షాలు కార్యాచరణను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశిస్తూ ఆరోపణలు గుప్పించారు.

Bandi Sanjay Comments on KTR : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులతో సమావేశం కావడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజకీయాలు, పరిపాలన వేరు వేరు అన్న సంజయ్.. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, నాయకుడు వెళ్లినా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అపాయింట్​మెంట్ ఇస్తుందని తెలిపారు. అలాగే కేటీఆర్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చేసిన అభివృద్ధిపై కేసీఆర్ ఎప్పుడైనా.. ఎక్కడైనా మాట్లాడారా అని ధ్వజమెత్తారు. హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన శ్యామ ​ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమంలోబండి సంజయ్ పాల్గొన్నారు. పార్టీ నేతలతో కలిసి శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్ర పటం వద్ద నివాళులు అర్పించిన బండి... తొమ్మిదేళ్లకే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.

'ఎంతో మంది కాంగ్రెస్‌ నేతలు నన్ను కూడా కలిశారు. కేసీఆర్‌ చెప్తున్న అభివృద్ధిపై చర్చించేందుకు మేం సిద్ధం. ఏ అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించటం లేదో కేసీఆర్‌ చెప్పాలి. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకావాలని మహిళలను బెదిరిస్తున్నారు. ఏ పార్టీ పరిస్థితి ఏమిటో చూసే ప్రజలు ఓటు వేస్తున్నారు. మానసిక పరిస్థితి చూసే డిపాజిట్లు కూడా రాని ఓట్లు పడుతున్నాయి. బీజేపీ నుంచి ఎవరూ వెళ్లరు. మునిగిపోయే నావలో వెళ్లేవారిని మేం ఆపేది లేదు. తెలంగాణ కోసం 1400 మంది ఆత్మహత్య చేసుకుంటే 600 మందినే గుర్తించారు.'-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Bandi Sanjay

Bandi Sanjay Comments on Congress : అదేవిధంగా బండి సంజయ్ మానసిక స్థితి బాగులేదని ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఎవరి మానసిక స్థితి ఏంటో ప్రజలకు తెలుసు అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్​లో డిపాజిట్​లు కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మానసిక పరిస్థితి చూసే ప్రజలు అక్కడ ఓట్లు వేయలేదని విమర్శించారు. మునిగిపోయే నావలోకి వెళ్తామంటే తాము ఆపమన్న బండి సంజయ్.. బీజేపీ నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లరని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details