తెలంగాణ

telangana

balapur Ganapati Immersion: ప్రశాంతంగా ముగిసిన బాలాపూర్​ గణపతి నిమజ్జనం

By

Published : Sep 19, 2021, 9:20 PM IST

balapur Ganapati Immersion
balapur Ganapati Immersion

బాలాపూర్ గణనాథుడి నిమజ్జనం (balapur Ganapati Immersion) ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర పోలీస్​ శాఖ డీజీ శిఖా గోయల్​ సమక్షంలో... గంగమ్మ ఒడికి గణనాథుడిని సాగనంపారు.

నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న బాలాపూర్​ గణనాథుడు (balapur Ganapati) గంగమ్మ ఒడికి చేరాడు. భారీ శోభాయాత్ర నడుమ.. బాలాపూర్​ గణపయ్యను నిమజ్జనానికి (ganapathi Immersion) తీసుకొచ్చారు. రాష్ట్ర పోలీసు శాఖ డీజీ శిఖా గోయల్ సమక్షంలో హుస్సేన్​ సాగర్​లో నిమజ్జనం చేశారు.

శోభాయాత్ర సాగిందిలా..

హైదరాబాద్ (hyderabad) బాలాపూర్ నుంచి నిమజ్జనానికి ఉదయం బయలుదేరిన భారీ గణనాథుడు... చార్మినార్, మదీనా, అఫ్జల్​గంజ్​, బేగంబజార్, అబిడ్స్, బషీర్​బాగ్​, లిబర్టీ చౌరస్తా మీదుగా ట్యాంక్​బండ్​ వద్దకు చేరుకున్నారుడ. సాగర్​ వద్ద ఉన్న 9వ నంబర్​ క్రేన్ వరకు శోభాయాత్ర కొనసాగింది. భారీ గణనాథుడి నిమజ్జనానికి పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

దారి పొడవునా

శోభాయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భారీ గణపతిని దర్శించుకునేందుకు మార్గమధ్యలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. గంగమ్మ ఒడికి వెళ్తున్న గణపయ్యతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. డ్యాన్సులు చేస్తూ.. రంగులు చల్లుకుంటూ సంతోషంగా... పార్వతీ తనయుడిని సాగనంపారు.

ప్రశాంతంగా నిమజ్జనం

ట్యాంక్​బండ్​పై ఏర్పాటు చేసిన 9న నంబర్​ క్రైన్​ వద్ద గణపతిని నిమజ్జనం చేశారు. క్రైన్​ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా గణపతిని సాగర్​లో నిమజ్జనం చేశారు. గంగమ్మ ఒడికి చేరిన గణపయ్య నిమజ్జన వేడుక దృశ్యాలను అందరూ తమ కెమెరాల్లో బంధించారు.

ప్రశాంతంగా ముగిసిన బాలాపూర్​ గణపతి నిమజ్జనం

ఇదీ చూడండి:Ganesh Immersion Hyderabad: హైదరాబాద్​లో గణేశుల శోభాయాత్ర ఏరియల్​​ వ్యూ చూశారా..?

ABOUT THE AUTHOR

...view details