ETV Bharat / state

మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి - కమిటీ సూచనలకు అనుగుణంగా పనులు? - Medigadda Barrage Damage Repairs

author img

By ETV Bharat Telangana Team

Published : May 15, 2024, 9:58 AM IST

Medigadda Barrage Damage Repairs : గతేడాది దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా పనులు చేసేందుకు చర్చలు జరిగింది. ఈ అంశాలపై నిర్మాణ సంస్థ ఎల్​ అండ్​ టీ, నీటిపారుదల శాఖ మధ్య సమావేశం జరిగింది.

Medigadda Barrage Damage Repairs
Medigadda Barrage Damage Repairs (ETV Bharat)

Medigadda Barrage Repairs in Telangana : మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు మరమ్మతుల విషయమై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన అంశాలపై నిర్మాణ సంస్థ ఎల్​ అండ్​ టీ(L&T) కంపెనీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ ఈఎన్​స్సీ అనిల్​ కుమార్​ సమావేశమయ్యారు. ఎన్డీఎస్​ఏ కమిటీ మధ్యంతర నివేదికలో చేసిన సూచనలకు అనుగుణంగా చేయాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. 'ఓ అండ్​ ఎం(O & M)' ఈఎన్సీ నాగేందర్​ రావు, ఇతర ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఎల్​ అండ్​ టీ సంస్థ ప్రతినిధులు సురేశ్​, చౌహాన్​ తదితరులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో మరమ్మతులకు సంబంధించిన అంశాలు, చేయాల్సిన పనులపై చర్చ జరిగింది. పని పూర్తి అయినట్లు గతంలో తమకు ధ్రువీకరణ పత్రం ఇచ్చారన్నారు. ఇప్పుడు మరమ్మతులు చేయాలంటే అనుబంధ ఒప్పందం చేసుకోవాలని తెలిపారు. డబ్బులు అధికంగా చెల్లించాల్సి ఉంటుందని ఎల్​ అండ్​ టీ(L&T) ప్రతినిధులు పునరుద్ఘాటించినట్లు తెలిసింది. అయితే ఒప్పందం, చెల్లింపుల విషయంలో నిబంధనలకు లోబడే ఉంటాయని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారమే పనులు చేయాలని నీటి పారుదల శాఖ స్పష్టం చేసినట్లు తెలిసింది.

కొనసాగుతోన్న జస్టిస్​ ఘోష్​ కమిషన్​ దర్యాప్తు : ఇప్పటికే మేడిగడ్డ ఆనకట్టపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కమిషన్​ రెండు దఫాలుగా రాష్ట్ర పర్యటనకు వచ్చి మేడిగడ్డను సందర్శించి వెళ్లారు. అలాగే నీటిపారుదల శాఖ అధికారులు, ఈఎన్సీలతో కూడా చర్చించారు. ఆనకట్టకు తదుపరి నష్టం జరగకుండా వర్షాకాలం లోపు చేయాల్సిన మరమ్మతులపైనా కమిషన్​ దృష్టి సారించింది.

జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్​ అయ్యర్​ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నుంచి మధ్యంతర నివేదికను జస్టిస్​ ఘోష్​ కమిషన్​ తెప్పించుకుంది. ఎన్డీఎస్​ఏ కమిటీ ఇచ్చిన సూచనలు పాటించాలని కోరింది. వాటి ఆధారంగా తగు చర్యలు తీసుకోవాలని కమిషన్​ రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఆదేశించింది. ముఖ్యమంత్రి, మంత్రి ఆమోదం అనంతరం ఈ పనులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు మేడిగడ్డ బ్యారేజీలోని పలు పిల్లర్లుకు బీటలు బారాయి. ఈ విషయం నాటి నుంచి నేటి వరకు హాట్​టాఫిక్​గా మారింది.

మేడిగడ్డపై కొనసాగుతున్న న్యాయవిచారణ - విశ్రాంత ఈఎన్సీని ప్రశ్నించిన కమిషన్ - JUSTICE PC GHOSE ON MEDIGADDA

'వర్షాకాలం రాబోతుంది - మేడిగడ్డ బ్యారేజీకి ముప్పు రాకుండా కాపాడుకోండి' - Justice Ghose Suggestions Medigadda

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.