తెలంగాణ

telangana

Avoid These Habits After Meal : తిన్న వెంటనే ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త పడాల్సిందే..!

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2023, 2:04 PM IST

Avoid These Habits After Meal in Telugu : మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవి.. మన అలవాట్లే. మన నిత్య జీవితంలో కొన్ని అలవాట్లు.. మనకు తెలియకుండానే ఆరోగ్యానికి హాని చేస్తుంటాయి. ఏం తినాలనే దానిపై దాదాపు అందరూ శ్రద్ధ పెడతారు. కానీ భోజనం చేసిన తర్వాత ఏం తినకూడదు.. ఏం చేయకూడదనే దానిపై మాత్రం చాలా మందికి తెలియదు. ఆహారం తీసుకున్న తర్వాత ఏ అలవాట్లు ఆరోగ్యానికి మంచివి, ఏవి కావో ఓసారి తెలుసుకుందామా..?

Things Not to do After Eating
Avoid These Habbits After Meal

Avoid These Habits After Meal in Telugu :ఆరోగ్యమే మహాభాగ్యం.. మన ఆరోగ్యాన్ని మించిన సంపద అంటూ ఏదీ లేదు. మనం రోగాల బారిన పడకుండా ఉండాలంటే.. మంచి ఆహారం తీసుకోవాలి. తీసుకున్న ఆహారంలోని పోషకాలు పూర్తిస్థాయిలో అందాలంటే.. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండాలి. అజీర్తి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే భోజనం చేసిన తర్వాత కొన్ని అలవాట్లను మానుకోవాలి.

Things Not to do After A Meal :కొందరకి భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం అలవాటు. అలాంటి వారు వీలైనంత త్వరగా ఈ అలవాటును మానుకోవడం శ్రేయస్కరమంటున్నారు నిపుణులు. సాధారణంగా మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి, పొట్టకు సరైన మొత్తంలో రక్తప్రసరణ అవసరం. అయితే తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల ఆ రక్తం చర్మం వైపు ప్రసరించి.. శరీర ఉష్ణోగ్రతను అదుపు చేస్తుంది. ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి మరింత సమయం పడుతుంది. దీని కారణంగా అజీర్తి వంటి సమస్యలు ఏర్పడతాయంటున్నారు నిపుణులు. అందుకే ఆహారం తీసుకున్నాక 30 లేదా 40 నిమిషాల తర్వాతే స్నానం చేయమంటున్నారు.

కాఫీ/టీలు తాగుతున్నారా.. మనలో చాలామంది కాఫీ/టీ ప్రియులుంటారు. ప్రతి సందర్బంలోనూ సేవిస్తుంటారు. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కాఫీ, టీలు తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అయితే దీనివల్ల మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలును గ్రహించే శక్తి శరీరానికి క్రమంగా తగ్గుతోందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇందుకు ముఖ్య కారణం వీటిలోని ఫినోలిక్‌ సమ్మేళనాలేనట. కాబట్టి భోజనం తీసుకున్న ఒక గంట విరామం తర్వాత.. తక్కువ మోతాదులో తాగితే ఎలాంటి సమస్యా ఉండదు.

పప్పులతో పండంటి ఆరోగ్యం.. ఇంకెందుకు ఆలస్యం తినేయండి మరి..

Health Tips in Telugu : కొందరు భోజనం చేసేటప్పుడు, తిన్న వెంటనే గడగడా నీళ్లు తాగేస్తుంటారు. ఇలా చేస్తే తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి పొట్టలో విడుదలయ్యే జీర్ణ రసాలు, ఎంజైమ్స్‌, తక్కువగా ఉత్పత్తావుతాయట. ఫలితంగా ఆహారం జీర్ణం అవడంలో సమస్య తలెత్తుతుంది.. కాబట్టి ఆహారం తీసుకుని గంటయ్యాక ఓ గ్లాసు నీళ్లు తాగాలి.

పండ్లు అప్పుడైతే మరీ మంచిదట.. పండ్లుసంపూర్ణ ఆరోగ్యానికి ఉత్తమ ఆహారం. వీటిని భోజనం అయ్యాక గాకుండా.. పరిగడుపున తీసుకుంటే ఉత్తమమంటున్నారు నిపుణులు. ఒకవేళ ఆహారం తర్వాత తీసుకుంటే ఇతర పదార్థాలతో అది కలిసిపోయి వాటిలోని సంపూర్ణ పోషకాలు శరీరానికి లభించవన్నది వారి అభిప్రాయం. కాబట్టి పండ్లు తినాలనుకుంటే అల్పాహారం, లంచ్‌కు మధ్యలో.. అదీ కాదంటే సాయంత్రం స్నాక్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు.

అయితే ఒక్కొక్కరి శరీర తత్వం, ఆరోగ్య స్థితి ఒక్కోలా ఉంటుంది.. కాబట్టి పై సమస్యలన్నీ అందరిలో వస్తాయని చెప్పలేం. పై అలవాట్ల కారణంగా మీ ఆరోగ్యంలో ఏదైనా అసౌకర్యం కలిగినట్లనిపిస్తే వెంటనే వాటిని మానేసి.. డాక్టర్లను సంప్రదించి సలహా తీసుకోవాలి.

Natural Antibiotics : వంటింట్లో దొరికే సహజ యాంటీబయాటిక్స్‌

Healthy Fat Foods : ఈ 'కొవ్వులు' ఎంతో మంచివి.. తింటే ఆరోగ్యం మీ సొంతం!

ABOUT THE AUTHOR

...view details