తెలంగాణ

telangana

ఎమ్మెల్యే వర్గం వర్సెస్​ జడ్పీ ఛైర్మన్ వర్గం.. అసలేమైందంటే..?

By

Published : Dec 22, 2022, 8:32 PM IST

Dispute Between Two Groups in YCP: వైసీపీలో మరోసారి రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈసారి అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డిపై జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వర్గం మండిపడింది. అసలు ఏం జరిగిందంటే..?

వైసీపీలో వర్గపోరు
వైసీపీలో వర్గపోరు

వైసీపీలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం

Dispute Between Two Groups in YCP : ఆంధ్రప్రదేశ్​లోని అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. జడ్పీ ఛైర్మన్ వర్గీయులు ఏకంగా ఎమ్మెల్యే మేడా పైనే ఎదురు తిరిగి వాగ్వాదానికి దిగారు. బుధవారం రాజంపేటలో జగనన్న స్మార్ట్ టౌన్​షిప్​ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సభ ముగిసిన అనంతరం తిరిగి వెళ్లిపోతున్న అన్నమయ్య అర్బన్ డెవలప్​మెంట్​ ఛైర్మన్ గురువు మోహన్​ను జడ్పీ ఛైర్మన్ వర్గీయులు అడ్డగించి ప్రశ్నించారు.

జడ్పీటీసీగా ఉన్న తన భార్యను సమావేశానికి ఎందుకు పిలవలేదని ఓ వ్యక్తి తీవ్రంగా మండిపడ్డారు. దళితులమనే భావనతోనే తమను సమావేశానికి ఆహ్వానించలేదా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలో ఉన్నా ఎలాంటి విలువ ఇవ్వడం లేదని.. కనీసం ప్రొటోకాల్ పాటించలేదని మరో వర్గం నాయకులు మండిపడ్డారు. దీనిపై మేడా మల్లికార్జున రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details