తెలంగాణ

telangana

Amaravati Farmers Meeting: తిరుపతిలో అమరావతి రైతుల సభకు హైకోర్టు అనుమతి

By

Published : Dec 15, 2021, 6:25 PM IST

Amaravati Farmers Meeting: ఈ నెల 17న అమరావతి రైతుల తలపెట్టిన బహిరంగ సభకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది.

Amaravati Farmers Meeting
Amaravati Farmers Meeting

Amaravati Farmers Meeting : ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈ నెల 17న అమరావతి రైతుల తలపెట్టిన బహిరంగ సభకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహించుకోవాలని రైతులకు సూచించింది. రాయలసీమ ఐక్య వేదిక సభను.. మరుసటిరోజు 18న నిర్వహించుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.

45 రోజుల క్రితం అమరావతిలోని తుళ్లూరు నుంచి ''న్యాయస్థానం టు దేవస్థానం'' పేరిట అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నిన్న అలిపిరి శ్రీవారి పాదాల చేరుకోవడంతో ముగిసింది.

ఇదీ చూడండి:CM KCR Meeting: ఎల్లుండి పార్టీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ కీలక భేటీ

ABOUT THE AUTHOR

...view details