తెలంగాణ

telangana

House Plots Regularization: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు

By

Published : May 1, 2023, 4:58 PM IST

Updated : May 1, 2023, 9:37 PM IST

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు

16:54 May 01

ఇళ్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్న సీఎం

House Plots Regularization in TS: 58, 59 ఉత్తర్వులకు లోబడి ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును మరో నెల రోజుల పాటు పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పేదల ఇళ్లు నిర్మాణం కోసం ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు వారి ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి, న్యాయపరమైన హక్కులను కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. జంటనగరాల పరిధిలోకి శాసనసభ్యులు, నేతలు సచివాలయంలో సీఎంను కలిసి ఇళ్ల స్థలాల అంశంపై విజ్ఞప్తులు చేశారు. నోటరీ స్థలాలు, 58, 59 ఉత్తర్వులకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయమై సానుకూలంగా ముఖ్యమంత్రి స్పందించారు. దీంతో ఈ విషయంలో గడువు మరో నెల రోజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తాం:ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని సీఎం మరోసారి కోరారు. నోటరీ, తదిర ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ సమస్యలను తక్షణమే తమ శాసనసభ్యులను కలిసి నివేదించాలని సూచించారు. అన్ని సమస్యలను క్రోడీకరించి, పరిష్కరించి, న్యాయపరమైన హక్కులతో కూడిన పట్టాలను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పేదల ఇళ్లు సమస్యలు అన్నీ పరిష్కారం కావాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సీఎం అన్నారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను పరిష్కరిస్తామన్న కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టర్లుతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated : May 1, 2023, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details