తెలంగాణ

telangana

పాస్ట్​పుడ్​ సెంటర్​పై దాడి కేసు.. నలుగురు అరెస్టు

By

Published : Feb 6, 2023, 7:30 PM IST

Attack On Past Food Center In Jawaharnagar: పాస్ట్​పుడ్​ సెంటర్​పై దాడి ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. రెండు రోజుల క్రితం కొనడానికి వచ్చి.. సామాగ్రిని దుండగులు ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు వారిని అరెస్ట్​ చేసి.. విచారిస్తున్నారు.

attack
దాడి

4 People Attacked Past Food Center: సికింద్రాబాద్.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులపై జరిగిన దాడి ఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జవహర్ నగర్ ఇన్​స్పెక్టర్​ తెలిపారు. రెండు రోజుల క్రితం ఫాస్ట్ ఫుడ్ కోసం గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు వచ్చినట్లు ఆయన వివరించారు. పార్సిల్ తీసుకుని వెళ్లే క్రమంలో ఫాస్ట్ ఫుడ్ నిర్వహకులకు.. కొనేందుకు వచ్చిన వారికి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

పార్సిల్ నిమిత్తం తినడానికి ప్లాస్టిక్ ప్లేట్లు ఇవ్వగా తమకు స్టీల్ ప్లేట్లు కావాలని కొనేందుకు వచ్చినవారు గొడవకు దిగి ఫాస్ట్ ఫుడ్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డట్లు తెలిపారు. వీరు ఆకాశ్​, వివేక్​, అమూల్​, కల్యాణ్​లుగా గుర్తించారు. ఆవేశంతో ఫాస్ట్ ఫుడ్ సిబ్బందిపై రాళ్లు కుర్చీలతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడి నిర్వాహకులకు తీవ్ర గాయాలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు.. ఈ నలుగురి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు లో నమోదయ్యాయి.

ఫాస్ట్​పుడ్ సెంటర్​పై దాడి చేసిన వ్యక్తులు అరెస్ట్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details