తెలంగాణ

telangana

రాష్ట్రానికి మరో భారీ పెట్టబడి.. స్వాగతం పలికిన కేటీఆర్

By

Published : Jan 5, 2023, 7:57 PM IST

Investments by Godrej Agrovet Limited: రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సంస్థ భారీ పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణకు వచ్చింది. గోద్రెజ్ సంస్థ రాష్ట్రంలో 250 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది.

ktr
ktr

Investments by Godrej Agrovet Limited: తెలంగాణలో మరో సంస్థ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. వంటనూనెల ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటు కోసం గోద్రెజ్ సంస్థ రాష్ట్రంలో 250 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ బలరాం సింగ్ యాదవ్ సమావేశమయ్యారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు.

ఖమ్మం జిల్లాలో పామాయిల్ ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. 2025 - 26 వరకు ప్లాంటును పూర్తి స్థాయిలో నడపాలని భావిస్తున్న గోద్రెజ్ సంస్థ... గంటకు 30 టన్నుల ప్లాంటును ప్రతిపాదిస్తోంది. దాన్ని గంటకు 60 టన్నుల సామర్థ్యానికి కూడా పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఓ ప్రైవేట్ సంస్థ పెడుతున్న పెద్ద పెట్టుబడి ఇదే కానుంది. గోద్రెజ్ సంస్థ పెట్టుబడిని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఆయిల్ పామ్ సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన శ్రద్ధ ఫలితాలను ఇస్తోందని అన్నారు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది ఏళ్లలో దాదాపు రూ.3 లక్షల 30 వేల కోట్లు విలువైన పెట్టుబడులు వచ్చినట్లు ఇటీవల మంత్రి కేటిఆర్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పాలనలో పారదర్శకత, సీఎం కేసీఆర్‌ ఆలోచనలతో కార్యరూపం దాల్చిన టీఎస్ ఐపాస్‌తో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు.

రాష్ట్రానికి ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం తమ ప్రభుత్వం సాధించిన ఘన విజయమని ప్రకటించారు మైనింగ్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఆతిథ్యం, ఇతర రంగాల్లోకి వచ్చిన పెట్టుబడులన్నీ కలిపితే వాటి విలువ మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ కృషితో లక్షలాది మందికి ఉపాధి లభించిందని మంత్రి అన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details