తెలంగాణ

telangana

evaru meelo koteeswarudu winner: ఎవరు మీలో కోటీశ్వరుడు విజేత ఓ పోలీస్ ఆఫీసర్

By

Published : Nov 17, 2021, 2:08 PM IST

ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమంలో విజేతగా నిలిచి ఏకంగా రూ.కోటి దక్కించుకున్నాడు ఓ పోలీసు అధికారి(evaru meelo koteeswarudu winner is a police officer). జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమంలో 15వ ప్రశ్నకు సమాధానం చెప్పటం ద్వారా రాజారవీంద్ర ఈ ఘనత సాధించారు. అయితే ఆ ప్రశ్న ఏంటి?... దానికి రాజారవీంద్ర ఎలా సమాధానం చెప్పారో తెలుసుకుందాం.

evaru meelo koteeswarudu winner
evaru meelo koteeswarudu winner

‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమంలో విజేతగా నిలిచి ఏకంగా రూ.కోటి (evaru meelo koteeswarudu winner is a police officer)దక్కించుకున్నాడు భద్రాద్రి జిల్లాకు చెందిన పోలీసు అధికారి. ఓ తెలుగు ఛానల్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న కార్యక్రమంలో 15వ ప్రశ్నకు సమాధానం చెప్పటం ద్వారా రాజారవీంద్ర ఈ ఘనతను అందుకున్నారు. మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ సంధించిన ప్రశ్నలకు డేటాబేస్‌డ్‌గా సమాధానాలు చెప్పి ఆయన రూ.కోటి గెలుచుకున్నారు. భద్రాద్రి జిల్లా సుజాతనగర్‌కు చెందిన బీవీఎస్‌ఎస్‌ రాజు, శేషుకుమారి దంపతుల కుమారుడైన రాజా రవీంద్ర ఇంజినీరింగ్‌ పూర్తి చేసి సాఫ్ట్​ వేర్‌ ఉద్యోగం కొన్నాళ్లు నిర్వహించారు. అనంతరం పోటీ పరీక్షలకు కూర్చుని ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ పోలీస్‌ సైబర్‌ క్రైం విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

పోలీస్‌ సైబర్‌ క్రైం విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న రాజారవీంద్ర

సుజాతనగర్‌లో సంబరాలు

సుజాతనగర్‌లోని స్వగృహంలో మంగళవారం పండుగ వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు రాజు, శేషుకుమారిలకు పలువురు అభినందనలు తెలిపి శాలువాలతో సన్మానించారు. పోటీలో విజేతగా నిలిచి సుజాతనగర్‌కు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన రవీంద్రను కొదమసింహం పాండురంగాచార్యులు, రామరాజు, సత్యనారాయణ, మంగన, శంకర్‌, శోభన్‌ తదితరులు అభినందించారు.

‘‘వేడి వాతావరణంలో మాటలు రావటం లేదు. గుండెలయ శబ్దాలు నాకు విన్పిస్తున్నాయి.’’ - ఎన్టీఆర్‌తో రాజారవీంద్ర

ఎన్టీఆర్‌ అడిగిన 13వ ప్రశ్న..

2020లో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఏ పదం ఇటాలియన్‌ భాషలో 40 రోజులు అనే అర్థాన్నిస్తుంది? ఈ ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్‌లో కొవిడ్‌ సంబంధిత పదాలు ఎక్కువగా ఉండటంతో ‘క్వారంటైన్‌’ అని సమాధానం చెప్పి రాజారవీంద్ర రూ.25 లక్షలు గెలుచుకున్నారు. ఎస్సైగా పనిచేస్తూ కరోనా బారినపడ్డ సమయంలో నిర్వర్తించిన బాధ్యతలు తనకు జవాబు తెలిసేలా చేసిందని అన్నారు.

రూ.50 లక్షల విలువైన 14వ ప్రశ్న..

‘జాతీయ వైద్యుల దినోత్సవం ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైద్యుడు జ్ఞాపకార్థం జరుపుతారు’.. జవాబు విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ ‘ఫీఫ్టీ ఫీఫ్టీ’ లైప్‌లైన్‌ను ఉపయోగించుకుని పశ్చిమ బంగ అనే సమాధానం చెప్పి రూ.50 లక్షలు గెలిచారు.

రూ.కోటి విలువైన 15వ ప్రశ్న...

1956లో రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు కారణమైన కమిషన్‌కు ఎవరు అధ్యక్షత వహించారు?’.. ఉత్కంఠభరిత వాతావరణంలో సంధించిన తుది ప్రశ్నకు ఆప్షన్లు ఎ) రంగనాథ్‌ మిశ్ర బి) రంజిత్‌సింగ్‌ సర్కారియా సి) బీపీ మండల్‌ డి) ఎస్‌.ఫజల్‌ఆలీ అని ఇచ్చారు. ‘ఫజల్‌ఆలీ’ అనే సమాధానం ఎంచుకున్నా రవీంద్ర కొంత సందిగ్ధంలో పడిపోయారు. మిగిలి ఉన్న లైఫ్‌లైన్‌ ‘ఫోన్‌ ఏ ఫ్రెండ్‌’ అవకాశాన్ని వినియోగించుకుని మిత్రుడైన ప్రేమ్‌కుమార్‌ సాయం తీసుకున్నారు. అతను సైతం అదే సమాధానం చెప్పటంతో ‘ఫజల్‌ఆలీ’ ఫిక్స్‌ చేశారు. కొద్ది క్షణాల అనంతరం ఎన్టీఆర్‌ ఒక్కసారిగా ‘మీరు కోటి రూపాయలు గెల్చుకున్నార’ని బిగ్గరగా చెప్పడంతో ఉత్కంఠకు(evaru meelo koteeswarudu winner is a police officer తెరపడింది. తాను గెల్చుకున్న మొత్తంలో కొంత పేద పిల్లలకు విరాళంగా, మిగిలినవి రైఫిల్‌ షూటింగ్‌ శిక్షణకు వినియోగించుకుని దేశం తరఫున పోటీల్లో పాల్గొంటానని రవీంద్ర వివరించారు.

ఇదీ చదవండి:'ప్రజాస్వామ్యం అంటే 'విధానం' మాత్రమే కాదు.. అది భారత్ స్వభావం'

ABOUT THE AUTHOR

...view details