తెలంగాణ

telangana

పరశురాముని అవతారంలో భద్రాద్రి రామయ్య దర్శనం

By

Published : Dec 28, 2022, 3:44 PM IST

Bhadradri Rama in Parasurama avatharam: శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య... పరశురాముని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఉత్సవమూర్తులను బేడా మండపం వద్దకు తీసుకువచ్చి... వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు

Bhadradri Rama in the avatar of Parasurama
పరశురామ అవతారంలో భద్రాద్రి రామయ్య

Bhadradri Rama in the avatar of Parasurama: భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యాయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భద్రాద్రి రామయ్య రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాలలో ఆరో రోజైన నేడు పరసురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి 11 గంటల వరకు ఆలయ దర్శనాలు నిలిపివేశారు.

రాష్ట్రపతి పర్యటన అనంతరం పరశురామ అవతారంలో ఉన్న స్వామి వారికి బేడా మండపంలో ధనుర్మాస పూజలు నిర్వహించనున్నారు.మధ్యాహ్నం మహారాజభోగం మహా నివేదన తరువాత స్వామివారిని తిరువీధులలో ఊరేగిస్తారు. అనంతరం మిథిలా స్టేడియం వద్ద ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు.

పరశురామ అవతారంలో భద్రాద్రి రామయ్య

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details