తెలంగాణ

telangana

ఆదిలాబాద్​లో ప్రశాంతంగా మొదలైన ఇంటర్​ పరీక్షలు

By

Published : Mar 4, 2020, 9:28 AM IST

ఇంటర్​ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా 31 కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు... విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

INTERMEDIATE FIRST YEAR EXAMS STARTED IN ADILABAD
ఆదిలాబాద్​లో ప్రశాంతంగా మొదలైన ఇంటర్​ పరీక్షలు

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరన్న నిబంధన దృష్ట్యా విద్యార్థులు గంట ముందే కేంద్రాల ముందు బారులు తీరారు. విద్యార్థులను క్షుణ్నంగా తనిఖీ చేసి ఉపాధ్యాయులు లోనికి అనుమతించారు. చివరి సమయంలో కొంత మంది విద్యార్థులు పరుగులు పెడుతూ కేంద్రాలకొచ్చారు.

పరీక్షాకేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా... అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచి నీటి సౌకర్యంతో పాటు మాస్​ కాపీయింగ్​ జరగకుండా నిఘా ఏర్పాటు చేశారు.

ఆదిలాబాద్​లో ప్రశాంతంగా మొదలైన ఇంటర్​ పరీక్షలు

ఇవీ చూడండి:నేటి నుంచి ఇంటర్​ పరీక్షలు.. హాజరవనున్న 9 లక్షలకుపైగా విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details