తెలంగాణ

telangana

Ganesh Nimajjanam in Telangana 2023 : వెళ్లిరా గణపయ్య.. మళ్లీ రా గణపయ్య.. గంగమ్మ ఒడిలోకి గణనాథుడు

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2023, 7:42 AM IST

Ganesh Nimajjanam in Telangana 2023 : రాష్ట్రవ్యాప్తంగా గణనాథుడి నిమజ్జనాలు ఘనంగా సాగాయి. చిన్నాపెద్దా అందరూ బొజ్జ గణపయ్యను వెళ్లిరా గణపయ్య.. మళ్లీ రా గణపయ్య అంటూ గంగమ్మ ఒడిలోకి సాగనంపారు. గణేశుడి నిమజ్జనానికి వాహనాలను అందంగా అలంకరించి.. డప్పు చప్పుళ్లు, సంప్రదాయ వాద్యాలు, కోలాటాలు, నృత్యాలతో జాతరను తలపించేలా నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి.

Ganesh Idol Immersion
Ganesh Idol Immersion Celebrations in Telangana

Ganesh Idol Immersion Celebrations in Telangana రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణేశుడి నిమజ్జనాలు

Ganesh Nimajjanam in Telangana 2023 :11 రోజులు ఘనంగా పూజలందుకున్న బొజ్జ గణపయ్య నిమజ్జనాలు(Ganesh Nimajjanam) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సాగాయి. అందంగా అలంకరించిన వాహనాలలో డప్పు చప్పుళ్లు, సంప్రదాయ వాద్యాలు, కోలాటాలు, నృత్యాలతో భక్త జనం కోలాహలం మిన్నంటింది. అంబరాన్నంటేలా శోభాయాత్రలతో వెళ్లిరా గణపయ్య, మళ్లీ రా గణపయ్య అంటూ గణనాథులను గంగమ్మ ఒడికి చేర్చారు.

Ganesh Nimajjanam in Adilabad 2023 :ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా గణేశ్‌ శోభాయాత్రలు కన్నుల పండువగా సాగాయి. సంప్రదాయ వస్త్రాధారణతో యువతీ, యువకులు డీజే పాటలకు, జానపద నృత్యాలు, కేరింతలతో హోరెత్తించారు. మహాలక్ష్మి గణేశ్​ మండల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక వీడ్కోలు కార్యక్రమంలో ప్రముఖ రెజ్లర్‌ ద గ్రేట్‌ ఖలీ(WWE Wrestler The Great Khali) సందడి చేశారు. కుమార్‌ జనతా మండల్‌ ఆధ్వర్యంలో 48 అడుగుల మహా గణపతిని ప్రతిష్టించిన చోటే మోటార్లతో నిమజ్జనం చేశారు. పుర వీధుల నుంచి మొదలైన శోభాయాత్ర మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగా నది వరకు కొనసాగింది. మందమర్రిలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ రథం తాడు లాగి వినాయక శోభాయాత్రను ప్రారంభించారు.

Balapur Ganesh Immersion Completed At Tank Bund : ముగిసిన బాలాపూర్ మహా గణపతి నిమజ్జనం

Ganesh Nimajjanam in Nizamabad 2023 : నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏకదంతుడికి శోభాయాత్రలను సెల్​ఫోన్​లతో చిత్రీకరించి జ్ఞాపకాలను పదిలపర్చుకున్నారు. గాంధీ చౌక్‌ వద్ద ముస్లిం యువకులు భక్తులకు పళ్లు, నీళ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. మద్నూర్ బిచ్కుందలో సార్వజని గణేశ్‌ మండలి వారు మహారాష్ట్ర, కర్ణాటక సంప్రదాయంలో నిమజ్జనం నిర్వహించారు. పిట్లం, నిజాంసాగర్‌ మండలాలలో భజన, భక్తి పాటలతో విఘ్నేశ్వరుడి వీడ్కోలు యాత్రలు చేపట్టారు. సంగారెడ్డిలో 11 రోజుల పాటు పండ్లు, ఫలహారాలు, నైవేధ్యాలతో పూజించిన వినాయకుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. కాలికి గజ్జకట్టి ఆడుతూ.. చేతిలో కర్రపట్టి కోలాటం చేస్తూ విఘ్నాలు, దోషాలు తొలగించాలని స్వామి వేడుకుంటూ సాగనంపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రతిమలు నిమజ్జనాలయ్యాయి.

Telangana Ganesh Nimajjanam 2023 : ఉమ్మడి కరీంనగర్‌లో రెండో రోజు నిమజ్జనం అత్యంత వైభవోపేతంగా సాగింది. భక్తుల విశేష పూజలందుకున్న లంబోదరుడు గంగమ్మ చెంతకు చేరాడు. జగిత్యాల టవర్ సర్కిల్‌ నుంచి చింతకుంట చెరువు వరకు శోభాయాత్రలు అట్టహాసంగా సాగాయి. మంథనిలో చంద్రయాన్‌-3 రాకెట్‌ నమూనాలో ఏర్పాటు చేసిన పార్వతీసుతుడు, కూరగాయల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన గజాననుడు భక్తులను అమితంగా ఆకట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మేళతాళాలు, మంగళ వాద్యాలతో గోదావరి నదిలో నిమజ్జనాలు సాగాయి. నిమజ్జనానికి వచ్చిన విగ్రహాలను లాంచీలో ఎక్కించి నది మధ్యలోకి తీసుకెళ్లి శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు.

Minister Indrakaran Dance in Ganesh Nimajjanam : గణేశ్ నిమజ్జనోత్సవంలో తీన్మార్ డప్పులకు.. స్టెప్పులేసిన మంత్రి ఇంద్రకరణ్

Ganesh Nimajjanam 2023 Hyderabad : జైజై గణేశా.. బైబై గణేశా.. భాగ్యనగరంలో కన్నులపండువగా గణనాథుడి మహా నిమజ్జనోత్సవం

ABOUT THE AUTHOR

...view details