తెలంగాణ

telangana

సల్మాన్​ఖాన్​తో బాక్సర్​ నిఖత్‌ డ్యాన్స్​.. స్టెప్పులు భలే వేసిందిగా!

By

Published : Nov 9, 2022, 9:39 AM IST

బాక్సర్ నిఖత్ జరీన్‌ ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకుంది. అది ఆటల పరంగా కాదు. ఫ్యాన్‌మూమెంట్‌ను తీర్చుకోవడం ద్వారా. తన ఫేవరెట్‌ స్టార్‌ సల్మాన్​ ఖాన్​ను కలవడమే కాదు.. ఏకంగా ఆయనతో కలిసి ఓ సూపర్​హిట్​ సాంగ్​కు డ్యన్స్​ వేసిందామె.

Salman khan nikhat zareen boxer
సల్మాన్​ఖాన్​తో బాక్సర్​ నిఖత్‌ స్టెప్పులు

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ కల తీరింది. తాజాగా తన అభిమాన నటుడు సల్మాన్‌ఖాన్‌ను కలుసుకున్న ఆమె ఆయనతో కలిసి స్టెప్పులు కూడా వేసింది. సల్మాన్‌ 'లవ్‌' సినిమాలోని ఐకానిక్ సాంగ్​ సాథియా తూనే క్యా కియా పాటను రీక్రియేట్​ చేస్తూ ఇద్దరూ నృత్యం చేశారు. ఈ రీల్‌ సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది.

ఒలింపిక్స్‌ పతకం సాధించడం తన కల అని.. అది తీర్చుకున్నాక నేరుగా బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ను కలవాలనేది కోరికని నిఖత్‌ గతంలో ట్వీట్‌ చేసింది. జరీన్‌ ప్రపంచ ఛాంపియన్‌ అయ్యాక ఆమెను అభినందిస్తూ సల్మాన్‌ ట్వీట్‌ చేశాడు. డైరెక్టర్‌ సురేష్‌ కృష్ణ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌, రేవతి జోడిగా రూపొందిన 'లవ్‌'(1991) మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులో వెంకటేష్‌ రేవతిల 'ప్రేమ'(1989) చిత్రానికి ఇది హిందీ రీమేక్‌.

ఇదీ చూడండి:'కాంతార' క్లైమాక్స్ సీన్​​.. 'జబర్దస్త్'​ నూకరాజు ఇరగదీశాడుగా!

ABOUT THE AUTHOR

...view details