తెలంగాణ

telangana

పారిస్ ఒలింపిక్స్​లో స్వర్ణమే లక్ష్యం : పీవీ సింధు

By

Published : Mar 4, 2022, 8:45 PM IST

PV Sindhu Interview: పారిస్ ఒలింపిక్స్​లో బంగారు పతకమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపింది భారత స్టార్​ షట్లర్ పీవీ సింధు. ఈ మేరకు ఆమె 'ఈటీవీ భారత్'​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది.

PV Sindhu Interview
పీవీ సింధు

PV Sindhu Interview: భారత్​కు రెండు ఒలింపిక్​ పతకాలు అందించిన స్టార్​ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. పారిస్​ మెగా ఈవెంట్​కు సన్నద్ధమవుతోంది. పారిస్​లో ​బంగారు పతకం నెగ్గడమే తన లక్ష్యం అంటోంది. ఆ దిశగానే ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది సింధు. మూడు, నాలుగు స్థానాలకు ఎంతో తేడా ఉందని టోక్యో ఒలింపిక్స్​ సమయంలో తన కోచ్​ చెప్పినట్లు, ఆ మాటలు తనలో ఎంతో స్ఫూర్తిని రగిలించాయని పేర్కొంది. తాజాగా 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడింది సింధూ.

ఒలింపిక్స్​లో వరుసగా రెండోసారి పతకం సాధించడం ఎలా అనిపించింది?

వరుసగా రెండు ఒలింపిక్స్​లో పతకాలను సాధించడం సంతోషంగా అనిపించింది. ఈ విజయాలు నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. ఎందుకంటే ఒలింపిక్స్​లో మెడల్స్ సాధించడం అంత సులభం కాదు. అలాంటిది రెండు పతకాలు సాధించడం నాలో మరింత స్ఫూర్తిని నింపింది.

ప్రతిరోజు మీరు చురుకుగా ట్రైన్​ అవ్వడానికి, ప్రాక్టీస్ చేయడానికి స్ఫూర్తి ఏంటి?

నేను ఏది అనుకున్నానో దాన్ని సాధించాను. కానీ అంతటితో పూర్తికాలేదు. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. అదే నాకు స్ఫూర్తిని ఇస్తుంది. మున్ముందు ఎన్నో టోర్నీలు రానున్నాయి. వాటికోసం ఎదురుచూస్తున్నా. ఏది సాధించాలన్నా రోజూ సాధన చేయాలి. చేసే పనిలో వందశాతం దృష్టి సారించాలి.

టోక్యో ఒలింపిక్స్​లో గోల్డ్​ సాధించలేదన్న బాధ ఏమైనా ఉందా..?

నాకు మొదటిసారి మెడల్ వచ్చినప్పుడు.. అది నేను అసలు ఊహించలేదు. సిల్వర్ మెడల్ రావడం కచ్చితంగా పెద్ద విషయమే. రెండు ఒలింపిక్స్​లో పతకాలు సాధించడం అంత సులభం కాదు. నేను ఎప్పుడైనా పూర్తి సామర్థ్యంతో పనిచేశాను.

టోక్యో ఒలింపిక్స్​లో కాంస్యం సాధించిన తర్వాత వచ్చిన గొప్ప ప్రశంస ఏది?

టోక్యో ఒలింపిక్స్​లో కాంస్యం సాధించిన తర్వాత చాలామంది నన్ను ప్రశంసించారు. ఒలింపిక్స్​లో పతకం సాధించడం అంత ఈజీ కాదని చాలామంది చెప్పారు. అపజయం తర్వాత విజయం సాధించడం ఎంతో కష్టమని తనతో చెప్పారు.

పెద్ద టోర్నమెంట్స్​కోసం మీరు ఎలా సన్నద్ధమవుతారు?

ప్రతి టోర్నమెంట్​ కోసం నేను ఎంతో కష్టపడతాను. నన్ను బిగ్​ మ్యాచ్ ప్లేయర్​ అని పొగడడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ప్రతి మ్యాచ్​కు ఒకేలా ప్రాక్టీస్ మొదలు పెడతాను.

పారిస్​ ఒలింపిక్స్​లో గోల్డ్​ లక్ష్యంగా పెట్టుకున్నారా?

అవును. కచ్చితంగా పారిస్ ఒలింపిక్స్​లో బంగారు పతకం లక్ష్యంగా పెట్టుకున్నాను. దానికోసం ఎంతో కష్టపడాలి. గోల్డ్​ సాధిస్తాననే ఆశిస్తున్నా.

యంగ్​స్టర్స్​కు మీరు ఇచ్చే సందేశం ఏంటి?

నేను ఎంతోమంది యంగ్​స్టర్స్​ను చూశాను. కొంతమంది మెరుగ్గా ఆడటమూ గమనించాను. వారిని సరైన మార్గంలో గైడ్ చేయడంతోపాటు.. తల్లిదండ్రుల సపోర్ట్ కూడా అవసరం. కొన్ని సంవత్సరాల పాటు కఠిన శ్రమతోనే విజయం సాధిస్తామని యంగ్​స్టర్స్​ గమనించాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. టెక్నిక్స్​, నైపుణ్యాలతో ఆడటం అలవరచుకోవాలి.

ఇదీ చూడండి:Mohali Test Day1: తొలి రోజు టీమ్​ఇండియా భారీ స్కోర్​.. పంత్​ వీర బాదుడు

ABOUT THE AUTHOR

...view details