తెలంగాణ

telangana

Neeraj Chopra Diamond League 2023 : నీరజ్​ చోప్రా.. ఇక డైమండ్‌ లీగ్‌ స్వర్ణంపై గురి

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 7:53 AM IST

Neeraj Chopra Diamond League 2023 : ఇటీవలే ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా.. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ​ డైమండ్‌ లీగ్‌ స్వర్ణంపై గురిపెట్టాడు. మరి కొన్ని గంటల్లో ఈ లీగ్ ప్రారంభంకానుంది. ఆ వివరాలు..

Neeraj Chopra Diamond League 2023 : నీరజ్​ చోప్రా.. ఇక డైమండ్‌ లీగ్‌ స్వర్ణంపై గురి
Neeraj Chopra Diamond League 2023 : నీరజ్​ చోప్రా.. ఇక డైమండ్‌ లీగ్‌ స్వర్ణంపై గురి

Neeraj Chopra Diamond League 2023 : ఇటీవలే ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా.. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక టోర్నీ కోసం సిద్ధమవుతున్నాడు. డైమండ్‌ లీగ్‌లో గోల్డ్​ మెడల్​పై గురిపెట్టాడు. గురువారం నుంచి ఈ మెగా లీగ్​ ప్రారంభంకానుంది. ఇందులోనూ జైత్రయాత్ర కొనసాగించాలని ఎంతో పట్టుదలతో ఉన్నాడు.

Neeraj Chopra World athletics championships 2023 : రీసెంట్​గా బుడాపెస్ట్‌ వేదికగా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్​ ఈటెను 88.17 మీటర్ల దూరం విసిరి స్వర్ణంతో మెరిశాడు. జావెలిన్‌ హిస్టరీలోనే ఒలింపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్స్ సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుకు ఎక్కాడు. నీరజ్‌ కన్నా ముందు వరల్డ్​ రికార్డు గ్రహీత జాన్‌ జెలెజ్నీ (చెక్‌ రిపబ్లిక్‌), ఆండ్రియాస్‌ తోర్కిల్డ్‌సెన్‌ (నార్వే) మాత్రమే ఈ ఘనతలను దక్కించుకున్నారు. 1992, 1996, 2000 ఒలింపిక్స్‌లో జెలెజ్నీ విజేతగా నిలిచాడు. అలాగే 1993, 1995, 2001 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో టైటిళ్లను ముద్దాడాడు. ఇక ఆండ్రియాస్‌ 2008 ఒలింపిక్స్‌, 2009 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

Neeraj Chopra Diamond League Record : ఇకపోతే 25 ఏళ్ల నీరజ్‌.. ప్రస్తుతం ఈ సీజన్‌ డైమండ్‌ లీగ్‌లో అజేయ రికార్డును కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 5న దోహా , జూన్​ 30న లౌసానే లీగ్‌లలో అగ్ర స్థానాలను దక్కించుకుని ఇప్పటికే తన సత్తా ఏంటో నిరూపించాడు. ఆ తర్వాత రీసెంట్​గా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్​తో సత్తా చాటాడు. ఇప్పుడు డైమండ్​ లీగ్​లో... ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన జాకబ్‌ వాడ్లెజ్‌ (చెక్‌ రిపబ్లిక్‌), జూనియర్‌ వెబెర్‌ (జర్మనీ), రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఆండర్సన్‌ పీటర్స్​తో (గ్రెనెడా) నీరజ్‌ పోటీ పడనున్నాడు. బుడాపెస్ట్‌లో సిల్వర్ మెడల్​ గెలిచిన అర్షద్‌ నదీమ్‌ (పాకిస్థాన్‌).. ఇప్పుడు జ్యురిచ్‌ వేదికగా జరగనున్న డైమండ్ లీగ్​ టోర్నీకి దూరంగా ఉన్నాడు.

ABOUT THE AUTHOR

...view details