ETV Bharat / sports

Neeraj Chopra Fitness : ఇండియా గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా ఫిట్​నెస్​ సీక్రెట్​ ఇదే.. వామ్మో ఇంత కఠినమా!

Neeraj Chopra Fitness : వరల్డ్ ఛాంపియన్​గా అవతరించిన ఇండియా గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా తన ఫిట్‌నెస్‌ సీక్రెట్​ను తెలిపాడు. ఆ వివరాలు..

Neeraj chopra fitness diet
Neeraj Chopra Fitness : ఇండియా గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా ఫిట్​నెస్​ సీక్రెట్​ ఇదే.. వామ్మో ఇంత కఠినమా!
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 11:21 AM IST

Updated : Aug 29, 2023, 11:46 AM IST

Neeraj Chopra Fitness : అథ్లెట్స్​కు ఫిట్‌నెస్‌ కాపాడుకోవడమంటే పెద్ద సవాల్​ అనే చెప్పాలి. శరీరంలో ఏ కాస్త మార్పు వచ్చినా వారి కెరీర్​పై చాలా ఎఫెక్ట్ చూపుతుంది. ముఖ్యంగా బాడీలోని కొవ్వు శాతం 10 లోపలే స్థిరంగా ఉంచడం చాలా కఠినమైన విషయం. కానీ భారత స్టార్ జావెలిన్​ త్రోయర్​ నీరజ్‌ చోప్రా మాత్రం దాదాపు నాలుగేళ్లుగా తన బాడీ ఫిట్​నెస్​ను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. తాజాగా ప్రపంచ ఛాంపియన్​గా అతడు(Neeraj Chopra Wins Gold) అవతరించిన నేపథ్యంలో తన ఫిట్‌నెస్‌ సీక్రెట్​ను తెలిపాడు నీరజ్​.

డైట్‌ ఇలా.. "నిద్ర లేవగానే జ్యూస్‌ లేదా కొబ్బరి నీటితో రోజును ప్రారంభిస్తాను. మార్నింగ్ హెల్తీ అండ్​ లైట్​ బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకుంటాను. వీటిల్లో మూడు లేదా నాలుగు ఎగ్‌వైట్స్‌, రెండు బ్రెడ్‌ ముక్కలు, ఒక కప్పు నిండా పప్పులు, పండ్లు తింటాను. మధ్యాహ్న భోజనంలో అన్నం, పెరుగు, పప్పు ధాన్యాలు, గ్రిల్‌ చేసిన చికెన్‌, సలాడ్‌ తీసుకుంటాను. అదే ట్రైనింగ్​ క్యాంప్​లో అయితే భోజనం తర్వాత గ్యాప్‌లో పండ్లు, బాదం పప్పు తింటాను. నైట్​ టైమ్ డిన్నర్​ తేలిగ్గా ఉండేట్లు చూసుకుంటాను. ఆ సమయంలో సూప్‌, ఉడకబెట్టిన కూరగాయలు, పండ్లు తీసుకుంటాను" అని నీరజ్​ చెప్పాడు.

కాగా, నీరజ్‌ డైట్‌ విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. ఇక అతడి డైట్‌లో చాలా అరుదుగా చీట్‌ మీల్స్‌ ఉంటుంది. చుర్మా, స్వీట్లు, పానీపూరి వంటి వాటిని చీట్‌ మీల్స్‌ సమయంలో ఆరగిస్తాడు. ఇకపోతే క్రీడాకారులకు మాంసకృత్తులు (ప్రొటీన్‌) అనేది చాలా ముఖ్యం. కానీ, నీరజ్‌ 2016 వరకు మాత్రం పూర్తిగా కేవలం వెజ్ మాత్రమే తింటాడు. కానీ, ఆ తర్వాత శిక్షణా శిబిరాల్లో మరింత ఎనర్జీ కోసం నాన్‌వెజ్‌ను తినడం ప్రారంభించాడు. సాల్మన్‌ చేపను తినడం మొదలుపెట్టాడు. రీసెంట్​గా నాన్​వెజ్ తినడం గురించి మాట్లాడుతూ.. "మాంసాహారం.. తినడం మీకు మంచిదేనని నా అభిప్రాయడం. రీసెంట్​గా నేను తినడం మొదలు పెట్టాను. నేను మాంసాహారంలో ఎక్కువగా గ్రిల్‌ చేసిన సాల్మన్‌ చేపను తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాను" అని పేర్కొన్నాడు.

Neeraj Chopra Journey And Challenges : ఎన్నో అవమానాలు.. నీరజ్‌ లైఫ్ మలుపు తిరిగిందిలా.. బల్లెం వీరుడి కథ ఇది!

Neeraj Chopra Wins Gold : బల్లెం వీరుడు నీరజ్​ స్వర్ణ చరిత్ర.. ప్రపంచ ఛాంపియన్‌షిప్​లో తొలి భారత అథ్లెట్​గా ఘనత

Last Updated : Aug 29, 2023, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.