తెలంగాణ

telangana

'టెన్షన్​ ఎందుకు? టైమ్ వస్తే అదే అవుతుంది!'.. 90 మీటర్స్ టార్గెట్​పై నీరజ్​ కూల్ రిప్లై

By

Published : Sep 1, 2022, 4:57 PM IST

Updated : Sep 1, 2022, 5:17 PM IST

ఒలింపిక్స్​లో 87.58 మీటర్లు జావెలిన్​ విసిరి స్వర్ణం సాధించాడు నీరజ్ చోప్రా. అప్పటి నుంచి అనేక మంది ప్రశ్న ఒకటే.. 90మీటర్ల దూరం విసరగలడా? ఎప్పుడు? ఈ ప్రశ్నకు ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖిలో జవాబు చెప్పాడు నీరజ్.

neeraj chopra olympic record
It will happen when it has to happen, says neeraj chopra olympic gold medal winner on 90m throw

Neeraj Chopra 90m throw : భారత జావెలిన్ త్రో ఆణిముత్యం నీరజ్​ చోప్రా. ఒలింపిక్స్​లో 87.58 మీటర్లు జావెలిన్​ విసిరి స్వర్ణం సాధించాడు. ఇటీవల జరిగిన డైమండ్​ లీగ్​లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. అయితే తదుపరి తన ఆటపై ప్రశ్నించగా 90 మీటర్ల ప్రదర్శన ఎప్పుడు జరగాలో, అప్పుడే జరుగుతుందని అన్నాడు.

ప్రశ్న: డైమండ్​ లీగ్​ గెలవడం మీకు మొదటిసారి. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా మీరు ఎలా ఫీల్​ అవుతున్నారు?
జవాబు: మొదటి భారతీయుడిగా ఈ లీగ్​ గెలవడం చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే ప్రపంచంలోని గొప్ప గొప్ప ప్లేయర్లు ఈ లీగ్​లో పాల్గొన్నారు. వారిలో ఒక్కడిగా ఉన్నందుకు, తర్వాత గెలిచినందుకు చాలా గొప్పగా ఫీల్​ అయ్యాను. భారత్​ నుంచి కూడా చాలా మంది ప్లేయర్లు ఈ లీగ్​లో పాల్గొంటారని ఆశిస్తున్నాను. ఇది ప్రపంచ స్థాయి లీగ్​. ఇందులో బాగా రాణిస్తే ఒలింపిక్స్​లో, అసియా కప్​లో, కామన్​వెల్త్​ గేమ్స్​లో మంచి ప్రదర్శన చేయొచ్చు. అలా జరిగితే.. ఇప్పుడున్న భారత అథ్లెటిక్స్ పరిస్థితి మారుతుంది.

ప్రశ్న: ఒలింపిక్స్​ తర్వాత ఇది మీకు మొదటి టోర్నమెంట్​. మీరు కామన్​వెల్త్​ గేమ్స్​లో కుడా పాల్గొనలేదు. మీకు గాయం ఎలా అయింది? దాని నుంచి ఎలా కోలుకున్నారు?
జవాబు: అవును, ఇది నా మొదటి టోర్నమెంట్. గాయం కారణంగా కామన్​వెల్త్​ గేమ్స్​లో పాల్గొనలేదు. కామన్​వెల్త్​ గేమ్స్​ ప్రారంభమయ్యే సమయానికి గాయం నొప్పి అంతగా లేదు. ప్రాక్టీస్​ అంతా సజావుగానే సాగింది. కానీ చివరి నిమిషంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాము. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని గాయం నుంచి కోలుకున్నా.

ప్రశ్న: సెప్టెంబర్​ 8న జరగనున్న జూరిచ్​ డైమండ్​లీగ్​ ఫైనల్ పై మీరు దృష్టి సారించారు అనిపిస్తోంది. అందులో మీకేమైనా లక్ష్యాలు​ ఉన్నాయా?​
జవాబు: అవును, ఈ సీజన్​లో అదే లాస్ట్​ టోర్నమెంట్​. చాలా ప్లాన్స్​ ఉన్నాయి. అయితే ఎక్స్​ట్రా ఏదైనా చేయాలన్నా.. ఎక్కువ ట్రైనింగ్​ చేయాలన్నా నా వద్ద టైం లేదు. మంచి ప్రదర్శనతో, మంచి ఆరోగ్యంతో ఈ సీజన్ ను ముగించాలనుకుంటున్నా. అందరూ 90 మీటర్ల గురించి అడుగుతున్నారు. కానీ నేను నిలకడగా ఉన్నందుకు సంతోషిస్తున్నాను. 90 మీటర్లు ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. దాని కోసం నేను ఒత్తిడి పెంచుకోదలచుకోలేదు.

భారత జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్​ చోప్రా ఇంటర్య్వూ

నీరజ్​ చోప్రా మెరుపులు:
⦁ డైమండ్​ లీగ్​ గెలిచిన మొట్టమొదటి భారతీయుడు.

⦁ 89.08 మీటర్లు జావెలిన్ విసిరి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇతడు చేసిన మూడు ప్రదర్శనల్లో ఇది అత్యుత్తమైనది.

⦁ టోక్యో ఒలంపిక్స్​లో స్వర్ణం సాధించాడు. సెప్టెంబర్ 8న జరగనున్న జూరిచ్​ డైమండ్​ లీగ్ ఫైనల్​లో పాల్గొననున్నాడు.

⦁ వచ్చే సంవత్సరం బుడాపెస్ట్​లో జరగబోయే ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో పాల్గొననున్నాడు.

ఇవీ చదవండి:హాంకాంగ్​తో మ్యాచ్​.. ఆరేళ్ల తర్వాత కోహ్లీ అలా

భారత్​-హాంకాంగ్​ మ్యాచ్​.. స్టేడియంలో క్రికెటర్​ లవ్​ ప్రపోజల్​

Last Updated : Sep 1, 2022, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details