తెలంగాణ

telangana

విజయమంటే వైఫల్యాల నుంచి నేర్చుకోవడమే: అభినవ్​ బింద్రా

By

Published : Oct 10, 2021, 8:56 AM IST

విజయం అంటే పూర్తిగా వైఫల్యాల నుంచి నేర్చుకోవడమే అని బీజింగ్‌ ఒలింపిక్స్‌ బంగారు పతక విజేత అభినవ్‌ బింద్రా అన్నారు(abhinav bindra gold medal). స్వర్ణం సాధించాక తాను మళ్లీ షూట్‌ చేయకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారో తెలిపారు.

abhinav
అభినవ్​ బింద్రా

ప్రపంచ మానసిక దినోత్సవాన్ని (అక్టోబర్‌ 10న) పురస్కరించుకొని బాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ దీపికా పదుకొణె(deepika padukone new update) ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో డిప్రెషన్‌ను జయించినామె.. 'లివ్‌ లవ్‌ లాఫ్‌' అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి మానసిక సమస్యలతో బాధపడేవారికి ఆసరాగా నిలుస్తున్నారు. తాజాగా బీజింగ్‌ ఒలింపిక్స్‌ బంగారు పతక విజేత అభినవ్‌ బింద్రాతో(abhinav bindra beijing) 'లెక్చర్‌ సిరీస్‌ 2021'తో ఓ ప్రొగ్రామ్‌ని ఏర్పాటు చేశారు. ఈ షోలో అభినవ్‌ బింద్రా తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అప్పుడు ఆటలంటే ఇష్టం ఉండేది కాదు
"చిన్నప్పుడు నేను క్రీడలను అస్సలు ఇష్టపడేవాడిని కాదు. చాలా లావుగా ఉండేవాడిని. పాఠశాలలో చదువుకునేటప్పుడు ఆటలను మిస్‌ అయ్యేవాడిని. కష్టపడే మనస్తతత్వం నాలో ఉండేది. ఇదే నా టాలెంట్‌గా భావించేవాడిని. ఇక విజయానికి నిర్వచనం ఇవ్వమంటే ఒకటే చెబుతా.. విజయం అంటే పూర్తిగా వైఫల్యాల నుంచి నేర్చుకోవడమే" అని అభినవ్ చెప్పగానే వెంటనే దీపిక.."మీరు నా మాటల్నే చెబుతున్నట్టు అనిపిస్తోంది. నేను కూడా సక్సెస్‌ కన్నా ఫెల్యూర్‌ నుంచే నేర్చుకున్నా" అని చెప్పారు.

స్వర్ణం సాధించాక కోచ్‌తో ఆ మాట చెప్పా
"మీలో చాలా మందికి తెలుసో తెలియదో.. నేను స్వర్ణ పతకం(abhinav bindra gold medal match) సాధించానని తెలియగానే నా కోచ్‌తో నేను చెప్పిన మొదటి మాట. 'జీవితంలో ఇంకెప్పుడూ షూటింగ్‌ చేయను' అని ఎందుకంటే దానికోసం నేను అంతగా శ్రమించా. అందుకే మళ్లీ షూట్‌ చేయకూడదని నిర్ణయించుకున్నా" అని అభినవ్‌ తెలిపారు.

ఓ రోజు ఏమైందంటే..
"నేను నిరుత్సాహంగా కూర్చున్నప్పుడు మా అమ్మ నా దగ్గరికి వచ్చారు. చాలా మంది రజతం, కాంస్యం గెలవొచ్చు. కానీ రాబోయే నాలుగేళ్లలో నువ్వు స్వర్ణ పతకం సాధిస్తావ్‌ అని భరోసా కల్పించింది. సరిగ్గా నాలుగేళ్ల తరువాత ఆమె చెప్పినట్టే నేను స్వర్ణం సాధించా. ఒలింపిక్స్‌లో పసిడి గెలిచినట్టు నా పేరు ప్రకటించగానే ఒక్కసారిగా నా కళ్లలో నీళ్లు తిరిగాయి" అని అభినవ్‌ చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి:ఫేవరెట్లుగా ధోనీసేన.. దిల్లీ కుర్రాళ్లు ఢీకొట్టగలరా?

ABOUT THE AUTHOR

...view details