తెలంగాణ

telangana

నీరజ్​ చోప్రా 'గోల్డ్​' జావెలిన్​ వేలం.. భారీ మొత్తానికి దక్కించుకుందెవరో తెలుసా?

By

Published : Sep 2, 2022, 10:53 PM IST

విశ్వవేదికపై చరిత్ర సృష్టించిన నీరజ్​ చోప్రా జావెలిన్​ వేలంలో అదిరే ధర దక్కించుకుంది. గతంలోనే దీనిని వేలం వేయగా రూ. 1.5 కోట్లకు బిడ్​ వచ్చింది. అయితే దీనిని దక్కించుకుంది ఎవరో తెలుసా?

It was BCCI that 'bought' Neeraj Chopra's javelin during e-auction in 2021
It was BCCI that 'bought' Neeraj Chopra's javelin during e-auction in 2021

BCCI Bought Neeraj Chopra Javelin : ఒలింపిక్స్‌ సంగ్రామాన భారత అథ్లెటిక్స్‌లో చరిత్ర సృష్టించిన జావెలిన్‌ అది.. భారత క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా చేతుల్లో నుంచి రివ్వున దూసుకుపోయి తొలిసారి స్వర్ణ పతకం ముద్దాడేలా చేసిన బల్లెం అది.. అలాంటి జావెలిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా నీరజ్‌ చోప్రా ఇచ్చాడు. మోదీ సేకరించిన మెమెంటోలను గతేడాది ఈ-ఆక్షన్‌లో పెట్టగా.. జావెలిన్‌కు రూ.1.5 కోట్లకు బిడ్‌ వచ్చింది. భారీ మొత్తంతో దక్కించుకున్నదెవరని అప్పట్లోనే చర్చ సాగింది. తాజాగా ఆ వివరాలు బయటకొచ్చాయి. ఆ జావెలిన్‌ను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఈ-వేలం ద్వారా వచ్చే సొమ్మును 'నమామీ గంగే' కార్యక్రమం కోసం వెచ్చించనున్నారు. గతేడాది సెప్టెంబర్‌-అక్టోబర్‌ మధ్య ఈ-వేలం జరిగింది.

''టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా జావెలిన్‌ను బీసీసీఐ బిడ్‌లో దక్కించుకుంది. జావెలిన్‌తోపాటు ఇతర కలెక్షన్ల కోసం బిడ్‌ దాఖలు చేశాం. నమామీ గంగే వంటి మంచి కార్యక్రమానికి చేదోడుగా ఉండటం గర్వంగా ఉందని ఆఫీస్‌ బేరర్స్‌ భావిస్తున్నారు. దేశం పట్ల ఇది మా బాధ్యత'' అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. నీరజ్‌ చోప్రా జావెలిన్‌తోపాటు పారా ఒలింపిక్‌ ఆటగాడు సంతకం చేసిన వస్త్రం (రూ. కోటి), ఫెన్సర్‌ భవానీ దేవి ఖడ్గం (రూ.1.25 కోట్లు), పారా ఒలింపిక్‌ జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్ అంటిల్‌ జావెలిన్‌ (రూ. 1.002 కోట్లు)ను కూడా బీసీసీఐ దక్కించుకుంది. కొవిడ్‌ మొదటి దశలో పీఎంకేర్‌కు బీసీసీఐ రూ. 51 కోట్లను విరాళంగా ఇచ్చింది.

ఒలింపిక్స్​ అనంతరం.. నీరజ్‌ చోప్రా తన బల్లెం మోదీకి చూపించాడు. అప్పుడు 'నువ్వు దీనిపై సంతకం చేశావు. నేను దీన్ని వేలం వేస్తాను. ఇబ్బందేం లేదుగా?' అని ప్రధాని అతడితో అన్నారు. చిరునవ్వుతో స్పందించిన నీరజ్‌.. తన జావెలిన్‌ను మోదీకి బహుకరించాడు. అంతే కాకుండా పీవీ సింధు తన రాకెట్‌ను ఇచ్చింది. బాక్సర్ లవ్లీనా నుంచి ప్రధాని బాక్సింగ్‌ గ్లోవ్స్‌ తీసుకున్నారు. 'నేనిప్పుడు వీటిని ధరిస్తే, మోదీ తమనేమో చేయబోతున్నారని రాజకీయ నాయకులు అంటారు' అని అప్పుడు మోదీ చమత్కరించారు.

ఇవీ చూడండి:మ్యాచ్​లో గాయపడ్డ నాదల్.. ముక్కు నుంచి రక్తస్రావం.. అయినా తగ్గేదే లే

స్టార్​ సింగర్​ బంగ్లాలో కొత్త వ్యాపారం ప్రారంభించనున్న కోహ్లీ.. ఏంటంటే

ABOUT THE AUTHOR

...view details