ETV Bharat / sports

స్టార్​ సింగర్​ బంగ్లాలో కొత్త వ్యాపారం ప్రారంభించనున్న కోహ్లీ.. ఏంటంటే

author img

By

Published : Sep 2, 2022, 3:52 PM IST

Updated : Sep 2, 2022, 4:10 PM IST

ఇప్పటికే పలు వ్యాపారాల్లోకి అడుగుపెట్టిన టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ ఇప్పుడు మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అదేంటంటే

virat kohli new restaurant
virat kohli new restaurant

virat kohli Leases out part of kishore kumar bungalow:

ఆసియాకప్​ 2022లో బిజీగా ఉన్న టీమ్​ఇండియా స్టార్‌ విరాట్‌ కోహ్లీ మరో కొత్త బిజినెస్ట్ ప్రారంభించబోతున్నారు. త్వరలోనే ఓ రెస్టారెంట్‌ ప్రారంభించనున్నారు. ముంబయిలోని బాలీవుడ్‌ లెజెండరీ సింగర్‌ కిషోర్‌ కుమార్‌కు చెందిన బంగ్లాలో ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని కిశోర్​ కుమార్​ తనయుడు అమిత్​ కుమార్​ తెలిపారు. ఈ బంగ్లాలోని 'గౌరీ కుంజ్‌' పోర్షన్‌ను విరుష్క దంపతులు ఐదేళ్ల పాటు లీజుకు తీసుకున్నట్లు వెల్లడించారు.

మరోవైపు విరాట్​ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. ''జుహు, ముంబయి.. కమింగ్‌ సూన్‌'' అంటూ హ్యాష్‌ట్యాగ్‌ జత చేశాడు. రెస్టారెంట్‌ ఏర్పాటుకు సంబంధించి లీజు, ఇతర పనులను కోహ్లీ లీగల్‌ అథారిటీ సెల్‌ దగ్గరుండి పర్యవేక్షించనుంది. కాగా విరాట్‌ కోహ్లీ తన జెర్సీ నెంబర్‌ 18ను వన్‌8 కమ్యూన్‌ పేరిట తన స్వస్థలం దిల్లీతో పాటు కోల్‌కతా, పుణెలో రెస్ట్రోబార్స్‌ ఏర్పాటు చేశాడు. ఇక 'వన్‌8' బ్రాండ్‌ పేరిట ఇప్పటికే క్లాత్‌, షూస్‌, హాస్పిటాలిటీ రంగాలలో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు కూడా అందుకుంటున్నాడు.

ఇటీవలే గణేష్​ చతుర్థి సందర్భంగా విరుష్క జోడీ అలిబాగ్​లో మరో కొత్త ఫామ్​ హౌస్​ను కొనుగోలు చేశారు. ఈ ఇళ్లు దాదాపు 8 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. దీని విలువు దాదాపు రూ.19కోట్లు ఉంటుందని సమాచారం.

ఇదీ చదవండి:

పవన్​కల్యాణ్​ అరుదైన ఫొటోలు చూశారా

కెప్టెన్​ రోహిత్​ సర్​ప్రైజ్​.. సిల్వర్​స్క్రీన్​ ఎంట్రీకి గ్రాండ్​గా ప్లాన్​.. హీరోయిన్​గా రష్మిక

Last Updated :Sep 2, 2022, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.