తెలంగాణ

telangana

Pakistan news today: భారత్​లో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టు

By

Published : Nov 21, 2021, 7:56 AM IST

వీసా సమస్యలతో 2016 ప్రపంచకప్​ దూరమైన పాకిస్థాన్ జూనియర్ హాకీ జట్టు.. ఇప్పుడు వరల్డ్​కప్​ కోసం మన దేశానికి వచ్చింది.

Pakistan Junior Hockey World Cup
పాకిస్థాన్ హాకీ జట్టు

అవును.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ జట్టు మన గడ్డపై అడుగుపెట్టింది. దాయాది దేశం భారత్‌ చేరుకుంది. ఈ నెల 24న భువనేశ్వర్‌లో ఆరంభమయ్యే జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ కోసం ఆ జట్టు శనివారం ఇక్కడికి చేరుకుంది.

పాక్‌ హై కమిషన్‌ ప్రతినిధి అఫ్తాబ్‌ హసన్‌ ఖాన్‌ జట్టుకు స్వాగతం పలికాడు. 2016లో లఖ్‌నవూలో జరిగిన జూనియర్‌ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ పోటీపడలేదు. వీసా సమస్యల కారణంగా అప్పుడు టోర్నీకి దూరమైంది. దక్షిణాఫ్రికా, కొరియా జట్లు కూడా శనివారం భువనేశ్వర్ చేరుకున్నాయి.

భువనేశ్వర్ ఎయిర్​పోర్ట్​లో పాక్ జూనియర్ హాకీ జట్టు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details