తెలంగాణ

telangana

రొనాల్డో.. నీ రికార్డు ఎవరికైనా సాధ్యమగునా..!

By

Published : Jan 30, 2020, 3:16 PM IST

Updated : Feb 28, 2020, 1:10 PM IST

ఫుట్​టాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఫుట్​బాల్ మైదానంలో తన ఆటతో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. తాజాగా మైదానం బయటా ఓ అరుదైన ఘనతను సాధించాడు.

రొనాల్డో
రొనాల్డో

పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో 200 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ కలిగిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఇన్​స్టా అధికారిక ఖాతా (330.5 మిలియన్ల ఫాలోవర్స్‌)కు మాత్రమే రొనాల్డో కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు. ఈ సందర్భంగా ఈ స్టార్ ఆటగాడు ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

హాలీవుడ్ సింగర్ అరియానా గ్రాండే (173.1 మిలియన్లు), డ్వేన్ జాన్సన్ (170మిలియన్లు), సలెనా గోమెజ్ (167మిలియన్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరో స్టార్ ఫుట్​బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ 148 మిలియన్ల ఫాలోవర్లతో ఏడో స్థానంలో ఉన్నాడు.

ఫేస్‌బుక్‌లో అత్యధిక లైక్స్ కలిగిన క్రీడాకారుడూ క్రిస్టియానో రొనాల్డోనే కావడం విశేషం. రొనాల్డో ఫేస్‌బుక్ పేజీని 122.3 మిలియన్ల మంది లైక్ చేయగా...124.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

ఇవీ చూడండి.. రోహిత్ 'సూపర్' సిక్సర్లు.. మరోసారి చూసేయండి

Last Updated : Feb 28, 2020, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details