ETV Bharat / sports

రోహిత్ 'సూపర్' సిక్సర్లు.. మరోసారి చూసేయండి

author img

By

Published : Jan 30, 2020, 2:08 PM IST

Updated : Feb 28, 2020, 12:52 PM IST

న్యూజిలాండ్​తో జరిగిన ఉత్కంఠభరిత మూడో టీ20లో టీమిండియా విజయం సాధించింది. సూపర్ ఓవర్​కు దారితీసిన ఈ మ్యాచ్​లో రోహిత్ శర్మ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి జట్టుకు మరపురాని విజయాన్ని అందించాడు. ఈ సిక్సర్ల వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

rohit
rohit

భారత్‌, న్యూజిలాండ్‌ మూడో టీ20 చాలాకాలం గుర్తుండిపోతుంది. ఆఖరి ఓవర్లో షమి 9 పరుగులు చేయకుండా కివీస్‌ను అడ్డుకున్నాడు. జోరు మీదున్న కేన్‌ విలియమ్సన్‌ (95), సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ను పెవిలియన్‌ పంపించాడు. ఫలితంగా మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత సూపర్‌ ఓవర్‌లోనూ అదే నాటకీయత కనిపించింది. బుమ్రా ప్రభావం చూపుతాడనుకుంటే విలియమ్సన్‌ ఓ సిక్సర్‌, బౌండరీ బాదాడు. ఆఖరి బంతికి గప్తిల్‌ బౌండరీ సాధించడం వల్ల టీమిండియా లక్ష్యం 18 పరుగులుగా మారింది.

భారత ఛేదనైతే సులభంగా ఏమీ సాగలేదు. సౌథీ పదునైన యార్కర్లు విసిరాడు. తొలి బంతికి రోహిత్‌ 2 పరుగులు తీశాడు. రనౌట్‌ ప్రమాదం తప్పించుకున్నాడు. రెండో బంతికి ఒక పరుగే వచ్చింది. మూడో బంతిని ఆఫ్‌సైడ్‌ జరిగిన రాహుల్‌ బౌండరీ బాదాడు. అప్పుడు స్కోరు 7/0. రాహుల్‌ భారీ షాట్‌కు ప్రయత్నిద్దామనుకున్నా సౌథీ యార్కర్‌తో సింగిల్‌ మాత్రమే వచ్చింది. ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు చేస్తేనే విజయం. అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. కొడతాడా? కొట్టడా?డగౌట్లో భారత్‌, కివీస్‌ ఆటగాళ్లలోనూ ఆందోళన. యార్కర్‌గా వేసిన ఐదో బంతిని రోహిత్‌ భారీ ఎత్తులోంచి సిక్సర్‌గా మలిచాడు. సౌథీ ఏ బంతి వేస్తాడో తెలియదు. 4 పరుగులు కావాలి. అనూహ్యంగా అతడు మళ్లీ యార్కర్‌ విసరడం.. హిట్‌మ్యాన్‌ ఫ్లడ్‌లైట్ల ఎత్తుకు బంతిని బాదడం.. కోహ్లీ సహా కుర్రాళ్లు మైదానంలోకి పరుగెత్తడం.. కివీస్‌ ఆటగాళ్ల గుండె మరోసారి పగలడం.. క్షణాల్లో జరిగిపోయింది.

ప్రస్తుతం రోహిత్‌ శర్మ బాదిన ఆఖరి రెండు సిక్సర్ల వీడియో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం.. ఆ కళ్లుచెదిరే సిక్సర్లను మరోసారి చూసేయండి.

ఇవీ చూడండి.. భారత్​తో వన్డే సిరీస్​కు కివీస్ జట్టు ప్రకటన

ZCZC
PRI ESPL NAT
.CHENNAI MES3
TN-GANDHI
Mahatma Gandhi remembered in TN, Puducherry
         Chennai, Jan 30 (PTI) Mahatma Gandhi was remembered in
Tamil Nadu on Thursday on his 72nd death anniversary, with
leaders paying tributes.
         Makkal Needhi Maiam founder Kamal Haasan described
Gandhi as "one of the most important ambassadors of world
peace" and termed his assassin, Nathuram Godse, an "allegedly
patriotic Indian."
         Earlier, Tamil Nadu Governor Banwarilal Purohit, Chief
Minister K Palaniswami, his deputy O Panneerselvam and state
Ministers paid floral tributes to a portrait of the Mahatma at
the Marina here.
         Haasan, who had courted controversy last year for his
statement that free India's "first extremist was a Hindu",
referring to Godse, condemned Gandhi's killing, calling it the
"lowest and meanest from of criticism."
         He took to Twitter to share his views.
         "The lowest & meanest form of criticism in a reformed
world is assassination. One of the most important ambassadors
of world peace and my personal torchbearer was shot dead by an
allegedly patriotic Indian on this day," he said without
naming Godse.
         "India remembers Gandhiji so that the history is not
repeated," he said in the tweet.
         At a poll rally in Karur district in May 2019, Haasan
had said "free India's first extremist was a Hindu, his name
is Nathuram Godse. There it (extremism, apparently) starts."
         Mahatma Gandhi was assassinated on this day in 1948
in New Delhi.
         In neighbouring Puducherry, Lt Governor Kiran Bedi and
Chief Minister V Narayanasamy paid homage to the Mahatma.
         Industries Minister M O H F Shah Jahan, Member of
Parliament V Vaithilingam and top-ranking officials were among
those present.
          Workers of the ruling Congress took out a silent
rally from the party office to Beach Road and paid homage at
the statue of the Mahatma. PTI SA COR
SS
SS
01301259
NNNN
Last Updated :Feb 28, 2020, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.