తెలంగాణ

telangana

ఐపీఎల్ హిస్టరీలోనే యంగ్​ కెప్టెన్​గా విరాట్ - లిస్ట్​లో పంత్, గిల్ - ఇంకా ఎవరంటే?

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 10:24 AM IST

Updated : Nov 28, 2023, 12:45 PM IST

Youngest IPL Captain : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్.. 24 ఏళ్లకే ఐపీఎల్​లో జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్​ హిస్టరీలో అతి తక్కువ వయసులో కెప్టెన్​గా వ్యవహరించిన వారెవరంటే?

youngest ipl captai
youngest ipl captai

Youngest IPL Captain :టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్​మన్ ఐపీఎల్​లో ప్రమోషన్ పొందాడు. 2024 సీజన్​లో గుజరాత్ టైటాన్స్ జట్టు సారథ్యం వహించనున్నాడు. అయితే టీమ్ఇండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య.. ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ జట్టుకు ట్రేడవడం వల్ల.. గిల్​కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది జట్టు యాజమాన్యం. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.

" రెండేళ్లుగా శుభ్​మన్ గిల్ అత్యుత్తమ క్రికెట్​ ఆడుతున్నాడు. రానున్న ఐపీఎల్​ సీజన్​లో గుజరాత్ టైటాన్స్ జట్టును నడిపించేందుకు శుభ్​మన్ గిల్ రెడీ. ఈ కొత్త జర్నీ స్టార్ట్ చేయనున్న గిల్​కు శుభాకాంక్షలు" అని ట్విట్టర్లో పేర్కొంది. దీనిపై స్పందించిన గిల్.. "గుజరాత్​ టైటాన్స్​కు కెప్టెన్​ అవ్వడం గర్వంగా ఉంది. నాపై నమ్మకంతో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన జట్టు యాజమాన్యానికి ధన్యవాదాలు. రెండు సీజన్లు ఆడిన అనుభవంతో జట్టును ముందుకు నడిపిస్తా" అని అన్నాడు.

అయితే శుభ్​మన్ గిల్ 24 ఏళ్లకే జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్​లో అతిచిన్న వయసులో కెప్టెన్సీ చేపట్టే ప్లేయర్ల లిస్ట్​లో టాప్​ 10లో చేరాడు. ఈ జాబితాలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ హిస్టరీలోనే అతి తక్కువ వయసులో జట్టుకు కెప్టెన్సీ వహించిన రికార్డు కొట్టాడు. మరి ఆ లిస్ట్​లో టాప్​లో ఉన్న కెప్టెన్లు ఎవరో తెలుసుకుందామా?

విరాట్ కోహ్లీ 22 ఏళ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2011
స్టీవ్ స్మిత్ 22 ఏళ్లు పుణె వారియర్స్ ఇండియా 2012
సురేశ్ రైనా 23 ఏళ్లు చెన్నై సూపర్ కింగ్స్ 2010
శ్రేయస్ అయ్యర్ 23 ఏళ్లు దిల్లీ క్యాపిటల్స్ 2018
రిషభ్ పంత్ 23 ఏళ్లు దిల్లీ క్యాపిటల్స్ 2021
రషీద్ ఖాన్ 23 ఏళ్లు గుజరాత్ టైటాన్స్ 2022
దినేశ్ కార్తిక్ 24 ఏళ్లు దిల్లీ క్యాపిటల్స్ 2010
శామ్ కరన్ 24 ఏళ్లు పంజాబ్ కింగ్స్ 2023
శుభ్​మన్ గిల్ 24 ఏళ్లు గుజరాత్ టైటన్స్ 2024

2024 IPL Auction :2024 ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 19న దూబాయ్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న, రిలీజ్ చేసిన ఆయా ప్లేయర్ల జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యను అట్టిపెట్టుకున్నట్లుగానే ప్రకటించింది. కానీ, కొన్ని గంటల్లోనే గుజరాత్ హార్దిక్​ను ముంబయి ఇండియన్స్​కు ట్రేడ్ చేసింది.

శుభ్​మన్​కు ప్రమోషన్​ - గుజరాత్ కొత్త కెప్టెన్​గా గిల్

గుజరాత్​కు ఇక సెలవు - ముంబయి గూటికి హార్దిక్ - డీల్​ ఎలా కుదిరిందంటే?

Last Updated :Nov 28, 2023, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details