తెలంగాణ

telangana

అది స్మృతి మంధాన రేంజ్​.. పాక్ కెప్టెన్​ బాబర్​ను మించేసిందిగా!

By

Published : Feb 14, 2023, 2:14 PM IST

ఓ విషయంలో పాకిస్థాన్​ కెప్టెన్​ బాబార్ ఆజంను అధిగమించి భారత మహిళా క్రికెటర్​ స్మృతి మంధాన రికార్డుకెక్కింది. అదేంటంటే..

smriti mandana and babar azam
smriti mandana and babar azam

క్రికెట్‌ హిస్టరీ మనకు ఇప్పటివరకు ఎన్నో టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లను పరిచయం చేసింది. అయితే వాటన్నింటికీ దీటుగా ఐపీఎల్‌ కొనసాగుతోంది. ఎంతో మంది క్రికెట్​ ప్రియుల మనసులు దోచుకుంది. 2007లో పురుషులతో ప్రారంభమైన ఈ లీగ్​ దాదాపు 15 సీజన్లు పూర్తి చేసుకుని ఇప్పుడు 16వ సీజన్​లోకి అడుగుపెట్టనుంది. అయితే ఈ సారి విశేషమేమిటంటే.. మహిళల ఐపీఎల్ కూడా ప్రారంభించబోతుండటం. డబ్ల్యూపీఎల్​ పేరుతో నిర్వహించనున్న ఈ లీగ్​ మార్చిలో ప్రారంభం కానుంది. ఇటీవలే ఫిబ్రవరి 13న వేలం కూడా జరిగింది. ఇందులో స్మృతి మంధాన రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఆర్సీబీ జట్టు ఈమెను దక్కించుకుంది.

అయితే కొంత మంది పాకిస్థానీ ప్లేయర్లతో పాటు అభిమానులు కూడా.. ఐపీఎల్‌ కన్నా పాకిస్థాన్​ సూపర్‌ లీగే బాగుంటుందంటూ ఎప్పుడూ సామాజిక మాధ్యమాల వేదికగా రచ్చ చేసేవారు. కానీ ఇప్పుడు సోమవారం జరిగిన వేలంతో బీసీసీఐ ముందు పీసీబీ మరోసారి తేలిపోయినట్టైంది. ఇందుకు టీమ్​ ఇండియా ప్లేయర్​ స్మృతి మంధానే కారణం.

ఎందుకంటే 2023 మహిళల ప్రీమియర్​ ఆక్షన్​లో అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్‌గా స్మృతి పేరు మారుమోగిపోయింది. ప్రముఖ ఐపీఎల్​ టీమ్​ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దాదాపు రూ.3.4 కోట్ల భారీ ధరకు స్మృతిని దక్కించుకుంది. దీంతో ఆమె పీఎస్​ఎల్​లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న బాబర్ ఆజం, షాహీన్ ఆఫ్రిది వంటి స్టార్‌ ఆటగాళ్లు కన్నా కూడా ఎక్కువ మొత్తాన్ని అందుకుని రికార్డుకెక్కింది.

ఇకపోతే పీఎస్‌ఎల్‌లో బాబర్‌ ఆజం ప్లాటినం కేటిగిరిలో ఉన్న సంగితి తెలిసిందే. ఈ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకి పాకిస్థాన్​ కరెన్సీలో రూ.3.60 కోట్లు అందుతుంది. ఈ కేటగిరీలో బాబర్‌ ఒక్కడే ఉన్నాడు. అంటే బాబర్‌ ఈ ఏడాది సీజన్‌కు గాను రూ. 3.60 కోట్ల మొత్తాన్ని అందుకున్నాడు. అయితే అతను అందుకునే పారితోషికం భారత కరెన్సీలో రూ.కోటి 23 లక్షలు. అంటే పీఎస్‌ఎల్‌లో అత్యధిక మొత్తం అందుకుంటున్న బాబర్ కన్నా మన స్మృతి మంధానే రెండున్నార రెట్లు ఎక్కువ మొత్తాన్ని మహిళల ప్రీమియర్ లీగ్ ద్వారా అందుకోనుంది.

ABOUT THE AUTHOR

...view details