ETV Bharat / sports

WPL 2023: భారీ ధరకు తెలుగమ్మాయి.. వేలంలో ఇంకా ఎవరెవరున్నారంటే?

author img

By

Published : Feb 14, 2023, 11:09 AM IST

Updated : Feb 14, 2023, 11:26 AM IST

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలం-2023లో తెలుగు తేజాలు మెరిసారు. సోమవారం జరిగిన వేలంలో.. తమ ఆటతో సత్తా చాటి ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన ఆరుగురు తెలుగు అమ్మాయిలు మంచి ధర దక్కించుకున్నారు. కాగా వేలంలో వీరికి పలికిన ధర, వీరి జట్ల వివరాలను ఓ సారి చూసేద్దామా..

wpl 2023
wpl 2023

మార్చిలో ప్రారంభం కానున్న మహిళల ప్రీమియర్‌ లీగ్​ కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. సోమవారం జరిగిన లీగ్‌ వేలం-2023లో ఆరుగురు తెలుగు అమ్మాయిలు వివిధ టీమ్​లకు ఎంపికయ్యారు. అంజలి శర్వాణి, సబ్బినేని మేఘన, షబ్నమ్‌ షకీల్‌, సొప్పదండి యషశ్రీ, అరుంధతి రెడ్డి, స్నేహ దీప్తి ఆటతో సత్తా చాటి ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించారు. వేలంలో వీరికి పలికిన ధర, వీరు ఏయే జట్లకు ఆడబోతున్నారన్న అంశాలు గురించి ఓ సారి తెలుసుకుందామా..

  • కర్నూల్‌ జిల్లా ఆదోనికి చెందిన లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌ అంజలి శర్వాణి భారత్‌ తరఫున 6 టీ20లు మ్యాచ్‌లు ఆడింది. ఈమెను 55 లక్షలు ధరకు యూపీ వారియర్స్​ ఎంపిక చేసుకున్నారు.
  • అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టు ప్లేయర్,​ వైజాగ్​కు చెందిన రైట్‌ ఆర్మ్‌ పేస్‌ బౌలర్‌ షబ్నమ్‌ షకీల్​ను గుజరాత్‌ జెయింట్స్‌ రూ.10 లక్షలకు ఎంపిక చేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన వి.స్నేహ దీప్తి భారత్‌ తరఫున 1 వన్డే, 2 టీ20లు ఆడి తన ప్రతిభను కనబరించింది. ఈమెను దిల్లీ క్యాపిటల్స్​ టీమ్​ రూ 30 లక్షలకు ఎంపిక చేసుకుంది.
  • విజయవాడకు చెందిన సబ్బినేని మేఘన..టీమ్​ఇండియా తరఫున 3 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఈమెను గుజరాత్‌ జెయింట్స్‌..రూ.30 లక్షలకు కొనుగోలు చేశారు.
  • హైదరాబాద్‌ వాసి పేస్‌ బౌలర్‌ సొప్పదండి యషశ్రీ ఇటీవల అండర్‌–19 ప్రపంచ కప్‌లో ఆడింది. ఈమెను యూపీ వారియర్స్‌ టీమ్​ రూ.10 లక్షలకు ఎంపిక చేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన రైట్‌ ఆర్మ్‌ పేస్‌ బౌలర్‌ అరుంధతి రెడ్డి.. భారత్‌ తరఫున 26 టీ20లు ఆడింది. ఈమెను రూ.30 లక్షలకు దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఎంపిక చేసుకుంది.
  • వీరిలో అంజలి శర్వాణి అత్యధికంగా 55 లక్షలు పలికింది. ఇదిలా ఉండగా... అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌-2023లో సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి, భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష మాత్రం వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది.
Last Updated :Feb 14, 2023, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.