తెలంగాణ

telangana

Warner On Allu Arjun : 'పుష్ప'కు వార్నర్ విషెస్.. వెల్​డన్​ అంటూ..

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 5:44 PM IST

Updated : Oct 18, 2023, 6:44 PM IST

Warner On Allu Arjun : ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్.. జాతీయ అవార్డు విన్నర్ అల్లు అర్జున్​కు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో నేషనల్ అవార్డ్ విజేతల ఫొటో షేర్ చేశాడు.

Warner On Allu Arjun
Warner On Allu Arjun

Warner On Allu Arjun :నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్.. మంగళవారం దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్​కు పలువురు సినీ ప్రముఖులు, సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పాటలకు స్టెప్పులేసి, తన మేనరిజం ఫాలో అయ్యే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కూడా బన్నీకి శుభాకాంక్షలు తెలిపాడు. వార్నర్.. జాతీయ అవార్డు విజేతల ఫొటోను ఇన్​స్టాగ్రామ్​ స్టోరీలో షేర్ చేశాడు. 'కంగ్రాజ్యులేషన్స్ అండ్ వెల్​ డన్​' అని స్టోరీలో రాసుకొచ్చాడు వార్నర్. అయితే వార్నర్, అల్లు అర్జున్​కు శుభాకాంక్షలు తెలుపడం వల్ల బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

ఇన్​స్టాగ్రామ్​లో అల్లు అర్జున్​కు విషెస్ తెలిపిన వార్నర్

ఇక జాతీయ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ ట్విట్టర్​లో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. " నేషనల్ అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా. నాకు గొప్ప గుర్తింపునిచ్చిన జ్యూరీకి, మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డు నేను సాధించిన ఘనతే కాదు, ఇది సినిమాను సపోర్ట్ చేసిన వారందరికీ చెందుతుంది. సుకుమార్​కు ప్రత్యేక ధన్యవాదాలు. నా విజయానికి కారణం ఆయనే" అని బన్నీ అన్నారు.

69వ జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్న నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత వహీదా రెహ్మాన్​కు కూడా అభినందనలు తెలిపారు.కాగా, 2021 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో విజేతలను ప్రకటించింది.

ఇక వార్నర్ విషయానికొస్తే.. గతంలో ఐపీఎల్​లో సన్​రైజర్స్​ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించినందున వార్నర్​కు, తెలుగు ఆడియోన్స్​కు ప్రత్యేక బంధం ఏర్పడింది. అప్పటినుంచి వార్నర్.. టాలీవుడ్ స్టార్ హీరోల ఫేమస్ డైలాగ్స్​, లేదా వారి పాటలకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో అప్​లోడ్ చేస్తుంటాడు. అందులో మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో, పుష్ప సినిమా పాటలకు చాలాసార్లు కాలు కదిపాడు. ఇక పుష్ప సినిమా 'తగ్గేదేలే' డైలాగ్ మేనరిజాన్ని గ్రౌండ్​లో అనేక సార్లు చేసి ఫ్యాన్స్​ను ఫుల్ ఖుషి చేశాడు.

డీజే టిల్లుగా వార్నర్ బాబాయ్ అదరగొట్టేశాడుగా

తగ్గేదేలే అంటోన్న వార్నర్‌.. 'శ్రీవల్లి' సాంగ్‌కు స్టెప్పులు

Last Updated : Oct 18, 2023, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details