తెలంగాణ

telangana

'భారత్​ను వారి గడ్డపైనే ఓడించాలి.. అదే నా కోరిక'

By

Published : Dec 29, 2021, 12:36 PM IST

Warner India Test Series: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన టెస్టు రిటైర్మెంట్​పై స్పందించాడు. తాను వీడ్కోలు పలకడానికి ముందు రెండు జట్లపై టెస్టు సిరీస్ గెలవాలని ఉందని తెలిపాడు. అది ఎవరిపై అంటే?

Warner team india test series, warner ashes 2023, వార్నర్ టీమ్ఇండియా, వార్నర్ యాషెస్ 2023
Warner

Warner India Test Series: ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్​లో సత్తాచాటుతున్నాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తాజాగా తన టెస్టు రిటైర్మెంట్​పై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ కంటే ముందు 2023లో ఇంగ్లాండ్​లో జరగబోయే యాషెస్​తో పాటు భారత గడ్డపై టెస్టు సిరీస్​ గెలవాలని కోరికగా ఉందన్నాడు.

"భారత్ గడ్డపై ఇప్పటివరకు టెస్టు సిరీస్ గెలవలేకపోయాం. ఈసారి గెలవడానికి ప్రయత్నిస్తాం. ఇంగ్లాండ్​తో 2019లో జరిగిన యాషెస్ సిరీస్​ను డ్రా చేసుకున్నాం. 2023లో వారి గడ్డపై వారిని ఓడిస్తామని అనుకుంటున్నా. ప్రస్తుతం నేను మంచి ఫామ్​లో ఉన్నా. భవిష్యత్​లో ఇదే ఫామ్​ను కొనసాగిస్తానని అనుకుంటున్నా."

-వార్నర్, ఆస్ట్రేలియా బ్యాటర్

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్​ వార్నర్​కు కలిసి రాలేదు. బ్యాటర్​, కెప్టెన్​గా విఫలమవడం వల్ల అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది సన్​రైజర్స్ హైదరాబాద్. రెండో అంచెలో అతడికి తుది జట్టులో అవకాశాలు లభించలేదు. దీంతో జట్టును వీడుతున్నట్లు ఆ సమయంలో తెలిపాడు వార్నర్. కానీ ఆ తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్​లో పరుగుల సునామీ సృష్టించాడు. ఆస్ట్రేలియా టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్​గా నిలిచాడు.

ఇవీ చూడండి: 'ఫామ్​లోకి వచ్చావుగా'.. వార్నర్​పై సన్​రైజర్స్ కామెంట్స్

ABOUT THE AUTHOR

...view details