తెలంగాణ

telangana

'కోహ్లీ.. సూపర్​హ్యూమన్​- ధోనీలో మంచు ప్రవహిస్తుంది'

By

Published : Feb 23, 2022, 11:20 AM IST

Virat Kohli: టీమ్​ఇండియా మాజీ సారథులు విరాట్​ కోహ్లీ, మహేంద్ర సింగ్​ ధోనీల నాయకత్వ లక్షణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్​. విరాట్​ కోహ్లీని సూపర్​హ్యూమన్​ అంటూ కొనియాడాడు. ఇక ధోనీలో మంచు ప్రవహిస్తుందని చెప్పాడు.

Virat Kohli
MS Dhoni

Virat Kohli: విరాట్​ కోహ్లీ, ధోనీ నాయకత్వ శైలీ గురించి వివరించాడు ఆస్ట్రేలియా మాజీ ఆల్​రౌండర్​ షేన్ వాట్సన్​. కోహ్లీ.. 'సూపర్​హ్యూమన్'​ అని అన్నాడు. ఐపీఎల్​లో విరాట్​ సారథ్యంలో ఆర్సీబీకి, మహీ కెప్టెన్సీలో సీఎస్కేకేకు ఆడాడు షేన్​వాట్సన్​.

కోహ్లీ

"కోహ్లీ.. నాయకుడిగా ఎన్నో అసారధారణమైన పనులు చేశాడు. ఆటగాళ్లను ఎంతో ప్రోత్సాహిస్తాడు. తన చుట్టూ ఉన్న ప్లేయర్స్​ను ఎలా ఆడించాలో, వారికి ఎలా మద్దతు ఇవ్వాలో అతడికి బాగా తెలుసు. కోహ్లీకి తనపై తనకు భారీ అంచనాలుంటాయి. ప్రతి గేమ్​లోనూ వాటిని అందుకునేందుకు కృషి చేస్తాడు. విరాట్​ ఓ సూపర్​హ్యూమన్​. అతడి వ్యక్తిత్వం చాలా మంచిది. అతడితో పనిచేయడం ఓ గొప్ప అనుభూతి."

-షేన్​ వాట్సన్, మాజీ క్రికెటర్

ధోనీలో మంచు ప్రవహిస్తుంది..

ధోనీ

"ధోనీ నరాల్లోనే ఐస్​ ప్రవహిస్తూ ఉంటుంది. ఒత్తిడిని తీసుకోగలడు. ప్లేయర్స్​పై నమ్మకం ఉంచుతాడు. ప్రతి ఆటగాడు తమ సామర్థ్యాలపై ఆత్మవిశ్వాసం ఉంచేలా చేస్తాడు. చుట్టూ ఉన్నవాళ్ల కోసం ఏం చేయాలి, తన కోసం తానేమీ చేయాలో అతడికి బాగా తెలుసు. మైదానంలో తన నైపుణ్యంపై నమ్మకం ఉంచుతాడు. అలానే ఆటగాళ్లపైనా ఉంచుతాడు. తద్వారా వాళ్లు మైదానంలో పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో నేర్చుకుంటారు." అని వాట్సన్​ అన్నాడు.

సహజమైన నాయకుడు.. రోహిత్​

రోహిత్

టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మపైనా ప్రశంసలు కురిపించాడు వాట్సన్​. అతడో గొప్ప సారథి అని చెప్పాడు. "రోహిత్​లో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ముంబయి ఇండియన్స్​కు అతడు సారథ్యం వహించే విధానాన్ని చాలా దగ్గరగా చూశాను. వృత్తి పట్ల నిబద్ధతగా ఉంటాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ముంబయి ఇండియన్స్​ లాంటి జట్టును బాగా నడిపించాడు. అతడు గొప్ప బ్యాటర్​. అతడి ఆటను చూడాటానికి బాగా ఇష్టపడతాను." అని వాట్సన్ తెలిపాడు.

ఇదీ చూడండి:'నువ్వు సూపర్​స్టార్​'.. కోహ్లీకి యూవీ స్పెషల్​ గిఫ్ట్

ABOUT THE AUTHOR

...view details