తెలంగాణ

telangana

'కెప్టెన్సీ రికార్డుని బట్టి ఆటగాడి విలువను చెప్పలేం'

By

Published : Dec 9, 2021, 9:32 PM IST

virat kohli
విరాట్ కోహ్లీ

Virat Kohli Captaincy: టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వన్డే జట్టుకు సారథిగా తప్పించడంపై మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ స్పందించాడు. బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుందని సమర్థించాడు.

Virat Kohli Captaincy: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ ఆల్ ఇండియా సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌ సమర్థించాడు. కెప్టెన్సీ రికార్డుని బట్టి ఆటగాళ్ల గొప్పతనానికి విలువ కట్టలేమని అన్నాడు. ఇటీవలే బీసీసీఐ అధికారులు కోహ్లీ స్థానంలో రోహిత్‌ శర్మకు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌ నుంచి రోహిత్‌.. టీమ్‌ఇండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

'పరిమిత ఓవర్ల క్రికెట్‌కు విరాట్‌ కోహ్లి స్థానంలో.. రోహిత్‌ శర్మను నియమించడంలో తప్పేమి లేదు. టీమ్ఇండియా తరఫున వాళ్లు ఆడే ప్రతి మ్యాచ్ ప్రత్యేకమైనదే. ఆటగాళ్ల మధ్య పోలికలు అనవసరం. రికార్డుల పరంగా చూస్తే ఒకరి కంటే మరొకరు మెరుగు అనిపించొచ్చు. అలాగే కెప్టెన్సీని బట్టి కూడా ఆటగాడి విలువను చెప్పలేం. టెస్టుల్లో అజింక్య రహానే కూడా నాణ్యమైన ఆటగాడే. పలు టెస్టులకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు మంచి ఫలితాలు సాధించాడు. అయితే, గత కొద్ది కాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. దీంతో టెస్టు ఫార్మాట్‌ వైస్‌ కెప్టెన్‌గా రహానేను కూడా తప్పించాల్సి వచ్చింది. ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు కూడా ఇదే తీరులో కెప్టెన్సీని కోల్పోయారు. అందుకే కెప్టెన్సీ రికార్డులను బట్టి ఆటగాళ్ల ప్రాముఖ్యతను చెప్పలేం. మనం ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంది' అని కీర్తి ఆజాద్‌ పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details