తెలంగాణ

telangana

టీ20 ప్రపంచకప్​ రికార్డుకు 14ఏళ్లు.. ఆ విశేషాలివే

By

Published : Sep 24, 2021, 10:50 AM IST

T20 WC

తొలి టీ20 ప్రపంచకప్​ను భారత్​ గెలిచి, శుక్రవారానికి(సెప్టెంబర్​ 24) 14 ఏళ్లు పూర్తయింది. తుదిపోరులో(T20 2007 World Cup Final) పాకిస్థాన్​పై చిరస్మరణీయ విజయం సాధించి చరిత్రలో నిలిచిపోయారు భారత కుర్రాళ్లు. మరి ఆ మ్యాచ్ విశేషాలేంటో తెలుసుకుందామా!

భారత్​పై గెలవాలంటే పాకిస్థాన్(T20 2007 World Cup Final) జట్టుకు 13 పరుగులు కావాలి. ఉన్నది ఒకటే ఓవర్, ఒకటే వికెట్. క్రీజులో కెప్టెన్ మిస్బా ఉల్ హక్. అనామక బౌలర్ జోగిందర్ శర్మకు కెప్టెన్ ధోనీ బంతి అందించాడు. రెండో బంతికే మిస్బా సిక్స్​ కొట్టడం వల్ల టీమ్​ఇండియా శిబిరంలో ఆందోళన. మరుసటి బంతిని షార్ట్​ లెగ్ దిశగా స్కూప్​ చేశాడు మిస్బా. శ్రీశాంత్ క్యాచ్ అందుకున్నాడు. స్టేడియంలో అభిమానులు కేరింతలు. భారత ఆటగాళ్ల ముఖంలో ఆనందం. అప్పుడే ధోనీ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసింది. భారత్ తొలి టీ20 ప్రపంచకప్​ను ముద్దాడింది. సరిగ్గా ఇది జరిగి శుక్రవారానికి(సెప్టెంబరు 24) 14 ఏళ్లు.

భారత జట్టు ప్రయాణం..

దక్షిణాఫ్రికాలో 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్​ను నిర్వహించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. అదే ఏడాది వన్డే ప్రపంచకప్​లో ఘోర పరాభవం ఎదుర్కొవడం వల్ల సచిన్, ద్రవిడ్, గంగూలీ లాంటి దిగ్గజాలు లేకుండానే, టోర్నీలో బరిలోకి దిగింది ధోనీ సారథ్యంలో టీమ్​ఇండియా.

ఫైనల్​కు(T20 2007 World Cup Final) చేరే క్రమంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి పటిష్ఠ జట్లను ఓడించి భారత కుర్రాళ్లు ఔరా అనిపించారు. తుదిపోరులో పాకిస్థాన్​పై చిరస్మరణీయ విజయం సాధించి చరిత్రలో నిలిచిపోయారు.

2007 టీ20 వరల్డ్ కప్​తో భారత జట్టు ​
విజయోత్సాహంలో భారత జట్టు

ఫైనల్​లో(T20 2007 World Cup Final) తొలుత బ్యాటింగ్​ చేసిన భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఛేదనలో పాక్.. వికెట్లన్నీ కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇదీ చదవండి:T20 World Cup 2021: వైరల్​గా టీ20 ప్రపంచకప్​ థీమ్ సాంగ్

ABOUT THE AUTHOR

...view details