తెలంగాణ

telangana

ఇదా.. హార్దిక్​ పాండ్య ఫిట్​నెస్​ మంత్ర?

By

Published : Nov 10, 2022, 7:24 AM IST

వెన్నెముక శస్త్రచికిత్స నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌, బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. మరి ఆ స్థాయిలో ఫిట్‌నెస్‌ కొనసాగించడానికి హార్దిక్‌ తీసుకునే ఆహారం ఏమిటో తెలుసా?

Hardik pandya fitness secret
హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్‌ మంత్ర తెలుసా

వెన్నెముక శస్త్రచికిత్స నుంచి కోలుకున్న తర్వాత మునుపటి జోరు అందుకున్న హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌, బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఆల్‌రౌండర్‌గా కొనసాగాలంటే ఫిట్‌నెస్‌ ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండాలి. మరి ఆ స్థాయిలో ఫిట్‌నెస్‌ కొనసాగించడానికి హార్దిక్‌ తీసుకునే ఆహారం ఏమిటో తెలుసా.. పెసరపప్పు కిచిడి. అవును.. ఇదే అతని ఫిట్‌నెస్‌ మంత్ర.

ఆ కిచిడి మీద కాస్త మసాలాలు, నెయ్యి వేసుకుని ఎంతో ఇష్టంగా తింటాడు. ఈ వంటకంతో పాటు వివిధ రకాల ఆహారాన్ని వేడివేడిగా వడ్డించడం కోసం ప్రత్యేకంగా వంట మనిషి ఆరవ్‌ నంగియాను తనతో పాటు తీసుకెళ్తాడు. స్వదేశంలోనైనా, విదేశాల్లోనైనా ఎక్కడ మ్యాచ్‌లున్నా హార్దిక్‌తో పాటు ఆరవ్‌ ఉండాల్సిందే. అతని ఖర్చులన్నీ హార్దిక్‌వే.

ఇదీ చూడండి:T20 Worldcup: ఇంగ్లాండ్‌తో భారత్‌ సెమీస్‌ పోరు నేడే.. ఫైనల్​కు వెళ్లేది ఎవరో?

ABOUT THE AUTHOR

...view details