తెలంగాణ

telangana

43 బంతుల్లోనే 193 పరుగులు - టీ10 క్రికెట్​లో వరల్డ్​ రికార్డ్​

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 4:18 PM IST

Updated : Dec 8, 2023, 4:28 PM IST

T10 Highest Score Batsman : యూరోపియన్ క్రికెట్ (టీ10) లీగ్​లో ప్రపంచ రికార్డు నమోదైంది. ఓ బ్యాటర్ ఏకంగా 43 బంతుల్లోనే 193 పరుగులు చేశాడు.

T10 Highest Score Batsman
T10 Highest Score Batsman

T10 Highest Score Batsman :క్రికెట్​లో ఫార్మాట్​ మారుతున్న కొద్ది రికార్డులు కూడా ఆ రేంజ్​లోనే నమోదవుతున్నాయి. గత కొన్నేళ్లుగా టీ20కి అడ్వాన్స్​డ్​గా టీ10 ఫార్మాట్​ను ప్రవేశపెట్టాయి ఆయా దేశాల క్రికెట్ బోర్డులు. యూఏఈ, ఖతార్, వెస్టిండీస్, యూరోపియన్, ఆఫ్రికాతో పాటు పలు దేశాల బోర్డులు, టీ10 ఫార్మాట్​ లీగ్​లు నిర్వహిస్తున్నాయి. ఈ ఫార్మాట్​లో పార్ట్​నర్​షిప్​లు, క్రీజులో కుదురుకోవడాలు ఉండట్లేదు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్టే బంతిని బౌండరీ దాటించే పనిలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యూరోపియన్ టీ10 లీగ్​లో వరల్డ్​ రికార్డు నమోదైంది.

యూరోపియన్ క్రికెట్ (టీ10) లీగ్​లో భాగంగా కాటలున్యా జాగ్వార్ - సోహల్ హాస్పిటల్టెట్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన కాటలున్యా జట్టు 10 ఓవర్లలోనే 257 భారీ స్కోర్​ చేసింది. ఈ జట్టులో బ్యాటర్ హమ్జా సలీమ్‌ దార్ 43 బంతుల్లోనే 193* పరుగులు (448.86 స్ట్రైక్ రేట్) చేసి ఔరా అనిపించాడు. ఇందులో 14 ఫోర్లు, 22 సిక్స్​లు ఉన్నాయి. అంటే బౌండరీల ద్వారానే అతడు 188 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో టీ10 హిస్టరీలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్​గా సలీమ్‌ దార్ నిలిచాడు. ఇంతకుముందు ఈ జాబితాలో లూయిస్‌ డు ప్లూయ్‌ (163 పరుగులు) ఉన్నాడు. తాజా ఇన్నింగ్స్​తో సలీమ్‌ దార్, లూయిస్‌ రికార్డు బద్దలుకొట్టాడు. ఇక హలీమ్​దార్ టీ10 కెరీర్​లో 3 వేల పరుగుల మార్క్ క్రాస్ చేశాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే..258 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన సోహల్ హాస్పిటల్టెట్ జట్టు, పది ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 104 పరుగులే చేసింది. దీంతో కాటలున్యా 153 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో సలీమ్ దార్​తోపాటు యాసిర్‌ అలీ, కేవలం 19 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. హాస్పిటల్టెట్ జట్టు బౌలర్ వారిస్‌ ఒక్క ఓవర్‌లోనే 43 పరుగులు సమర్పించుకోవడం విశేషం.

క్రికెట్​లో విచిత్రమైన నో బాల్ - వీడియో వైరల్ - మీరు చూశారా?

యూసఫ్ పఠాన్ సునామీ ఇన్నింగ్స్‌.. 14 బంతుల్లో 61 రన్స్.. థ్రిల్లింగ్​గా వీడియో!

Last Updated : Dec 8, 2023, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details