తెలంగాణ

telangana

'రూట్​ కంటే కోహ్లీ భిన్నం.. ఆ టెన్షన్​ అస్సలే ఉండదు'

By

Published : Dec 13, 2021, 10:34 AM IST

Salman Butt compares Virat and Root captaincy: దూకుడు స్వభావం పరంగా ఇంగ్లాండ్ సారథి జో రూట్ కంటే టీమ్ఇడియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందుంటాడని తెలిపాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రూట్ టెన్షన్​కు గురవుతాడని తెలిపాడు.

Virat kohli and Joe Root,Salman Butt compares Virat and Root captaincy,  సల్మాన్ బట్ కోహ్లీ రూట్, కోహ్లీ రూట్ లేటెస్ట్ న్యూస్
Virat

Salman Butt compares Virat and Root captaincy: జట్టును దూకుడుగా నడిపించడంలో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ కంటే టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ చాలా ముందున్నాడని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ సల్మాన్‌ బట్ అభిప్రాయపడ్డాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా గబ్బా టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆసీస్‌ ఘన విజయం సాధించింది. తుది జట్టు ఎంపిక నుంచి టీమ్‌ను నడిపించిన తీరు వరకు రూట్‌ విఫలమయ్యాడని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. పాక్‌ మాజీ సారథి బట్ అయితే కోహ్లీ, రూట్‌ నాయకత్వ తీరును సరిపోల్చాడు.

"ప్రత్యర్థి జట్టును సవాల్‌ చేసే దృక్పథం విరాట్ కోహ్లీది. ఆసీస్‌ పరిస్థితుల్లో అతడి మాదిరిగా దూకుడుగా బ్యాటింగ్ చేయడం అవసరం. అయితే ఇలాంటి వైఖరి రూట్‌లో కనిపించలేదు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కాస్త టెన్షన్‌గా కనిపించాడు. అయితే విరాట్ ముఖంలో మాత్రం ఒత్తిడి ఎప్పుడూ చూడలేం. ఆసీస్‌తో ఆడేటప్పుడు రూట్‌ కంటే కోహ్లీ బాడీలాంగ్వేజ్, గెలవాలనే కసి తీవ్రంగా కనిపిస్తుంది."

-సల్మాన్ బట్, పాక్ మాజీ క్రికెటర్

Ahesh 2021: యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 147 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసి 278 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ (89), డేవిడ్ మలన్ (82) రాణించడం వల్ల ఇంగ్లాండ్‌ మళ్లీ రేసులోకి వచ్చినట్లు అనిపించింది. అయితే కీలకమైన సమయాల్లో వికెట్లను చేజార్చుకున్న పర్యాటక జట్టు 297 పరుగులకే ఆలౌటైంది. ఆఖరి ఎనిమిది వికెట్లకు 74 పరుగులను మాత్రమే జోడించడం గమనార్హం. అనంతరం 20 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఇవీ చూడండి: వార్న్ టాప్-5 బ్యాటర్ల జాబితా.. భారత్ నుంచి ఒక్కరే!

ABOUT THE AUTHOR

...view details