తెలంగాణ

telangana

'భువనేశ్వర్ స్థానంలో శార్దూల్​కు అవకాశం ఇవ్వండి'

By

Published : Oct 20, 2021, 5:31 AM IST

టీ20 ప్రపంచకప్​లో పాకిస్థాన్​తో(Ind vs Pak T20 World Cup) జరగనున్న మ్యాచ్​లో ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్​కు అవకాశం ఇవ్వాలని మాజీ పేసర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar News) కోరాడు. ఫాస్ట్​ బౌలర్ భువనేశ్వర్​ ఫామ్​లో లేకపోవడం, హార్దిక్ పాండ్యా బౌలింగ్​ చేయకపోవడం జట్టుకు పెద్ద లోటని తెలిపాడు.

shardule
శార్దూల్ ఠాకూర్

టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup India team) భాగంగా ఈ నెల 24న పాకిస్థాన్‌తో(Ind vs Pak T20) జరగనున్న మ్యాచ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌కు అవకాశమివ్వాలని మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌(Ajit Agarkar News) సూచించాడు. ప్రస్తుతం భువనేశ్వర్‌ కుమార్‌ ఫామ్‌ లేమి, ఆల్‌-రౌండర్‌గా జట్టులోకి తీసుకున్న హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ చేసేందుకు సిద్ధంగా లేకపోవడం వల్ల.. భువనేశ్వర్‌ను పక్కన పెట్టి శార్దూల్‌కు ఒక అవకాశమిచ్చి చూడాలని అగార్కర్ పేర్కొన్నాడు.

"సాధారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తుంటాడు. ఒక వేళ పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తే.. ఐదుగురితో బరిలోకి దిగొచ్చు. కానీ, ఫ్లాట్‌ పిచ్‌పై కచ్చితంగా ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లు సహా ఆరుగురు బౌలర్లతో ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. భువనేశ్వర్‌ కుమార్‌ను పక్కన పెట్టి.. బుమ్రా, షమీ, శార్దూల్‌ ఠాకూర్‌, రవీంద్ర జడేజా, వరుణ్‌ చక్రవర్తి, రాహుల్ చాహర్‌లతో బరిలోకి దిగొచ్చు" అని అగార్కర్‌ సూచించాడు.

సోమవారం ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్ (51), ఇషాన్‌ కిషన్‌ (70) అర్ధ శతకాలతో రాణించారు. నేడు (అక్టోబర్ 20) మరో వార్మప్‌ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఇదీ చదవండి:

హార్దిక్​ బౌలింగ్​ చేయకపోయినా పర్వాలేదు: కపిల్ దేవ్

ABOUT THE AUTHOR

...view details