తెలంగాణ

telangana

Pakistan Odi World Cup 2023 : వరల్డ్​కప్​లో పాక్ ఉత్తమ ప్రదర్శన అదే.. ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేం!

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 7:26 AM IST

Pakistan Odi World Cup 2023 : ప్రపంచ కప్‌ పోరు అనగానే.. భారత్‌ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్​ అభిమానులు ఎదురు చూస్తారు. అయితే మరో ఆరు రోజుల్లో జరగనున్న వరల్డ్​ కప్​లో పాక్ జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Pakistan Odi World Cup 2023 : వరల్డ్​కప్​లో పాక్ ఉత్తమ ప్రదర్శన అదే.. ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేం!
Pakistan Odi World Cup 2023 : వరల్డ్​కప్​లో పాక్ ఉత్తమ ప్రదర్శన అదే.. ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేం!

Pakistan Odi World Cup 2023 :వరల్డ్ కప్​​ మరో ఆరు రోజుల్లో ప్రారంభంకానుంది. మెగాటోర్నీలో టీమ్​ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్​ అంటే ఆ మజానే వేరు. అయితే రెండో సారి కప్పును ముద్దాడాలనే లక్ష్యం.. భారత్‌ గడ్డపై జయకేతనం ఎగురవేయాలనే సంకల్పంతో పాకిస్థాన్​ వస్తోంది. ఈ సందర్భంగా జట్టు బలాబలాలను తెలుసుకుందాం..

పాకిస్థాన్​లో ఒకప్పుడు మేటి ఆటగాళ్లు ఉండేవారు. తొలి వరల్డ్​కప్​ (1975) మినహాయిస్తే.. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు సెమీస్​కు అర్హత సాధించింది. 1992లో ఛాంపియన్‌గా నిలిచింది. 1999లో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత నుంటి పాక్​ ప్రదర్శన తగ్గుతూ వచ్చింది.

గత ఐదు వరల్డ్​ కప్పుల్లో పాక్ బెస్ట్ పెర్​ఫార్మెన్స్​.. 2011లో సెమీస్‌ చేరడమే. 2019లో అయితే గ్రూప్‌ దశలోనే వైదొలిగింది. పాక్‌ ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేని పరిస్థితికి చేరుకుంది. అయితే ఈ సారి మాత్రం కాస్త బలంగానే కనిపిస్తోంది. కొంతకాలం నుంచి మెరుగ్గా ఆడుతోంది. టైటిల్‌కు గట్టిపోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బలాలు.. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ - పేసర్‌ షహీన్‌ షా అఫ్రిది పాక్​ జట్టుకు కొండంత బలం. బ్యాటింగ్‌లో బాబర్‌ కీలక ప్లేయర్​. నిలకడగా రాణిస్తున్నాడు. బౌలింగ్‌లో షహీన్‌ షా జట్టుకు అత్యంత ప్రధానమైన పేసర్​గా మారాడు. కొత్త బంతితో ఈ ఎడమ చేతి వాటం పేసర్‌ చాలా డేంజర్. హారిస్‌ రవూఫ్‌ కూడా మంచి వేగంతో బంతులను సంధిస్తున్నాడు. ఇక కొంతకాలంగా మంచిగా ఆడుతున్న వికెట్‌ కీపర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌పై కూడా నమ్మకం పెట్టుకోవచ్చు. ఆల్‌రౌండర్ల సంఖ్య కూడా జట్టులో ఎక్కువే. అఘా సల్మాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, షాదాబ్‌ ఖాన్‌, మహమ్మద్‌ నవాజ్‌.. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా చేయగలరు. ఇక పాక్ దేశం​ లాంటి పరిస్థితులే ఇక్కడ ఉండడంతో ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

బలహీనతలు.. ఒత్తిడికి అస్సలు తట్టుకోలేదు. అదే ప్రధాన బలహీనత. ఈజీగా గెలవొచ్చనే మ్యాచ్​లోనూ కాస్త ఒత్తిడికి తీసుకొస్తే.. అనూహ్య రీతిలో ఓడిపోతుంటుంది. అస్థిరతకు కేరాఫ్ అడ్రెస్​. రీసెంట్​గా ఆసియా కప్‌లో ఆడిన విధానం చూసిన అర్థమవుతుంది. బ్యాటింగ్‌లో భారం మొత్తం బాబర్‌, రిజ్వాన్‌పైనే ఉంది. వీళ్లు ఫెయిల్ అయ్యారా.. ఇక అంతే. మిడిల్‌, లోయర్‌ ఆర్డర్​లో సరిగ్గా నిలబడే ప్లేయర్ లేడు. ఈ ఏడాది ప్రారంభంలో కివీస్‌పై వరుసగా మూడు శతకాలు బాదిన ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. గాయంతో ప్రధాన పేసర్లలో ఒకడైన నసీమ్‌ షా దూరమయ్యాడు. నాణ్యమైన స్పిన్నర్లు లేరు. షాదాబ్‌ పేలవ ఫామ్‌తో ఉన్నాడు.

ఫైనల్​గా పాక్ ఉత్తమ ప్రదర్శన చేసింది 1992లో. అప్పుడు విజేతగా నిలిచింది.

టీమ్​ కీ ప్లేయర్స్​ :బాబర్‌ అజామ్‌, షహీన్‌ షా అఫ్రిది, హారిస్‌ రవూఫ్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌

Odi World Cup 2023 Pakistan Squad :టీమ్​ : బాబర్‌ అజామ్‌ (కెప్టెన్‌), అబ్దుల్లా షఫీక్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, ఫకర్‌ జమాన్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌, ఇమాముల్‌ హక్‌, అఘా సల్మాన్‌, సాద్‌ షకీల్‌, మహమ్మద్‌ వసీం, మహమ్మద్‌ నవాజ్‌, హారిస్‌ రవూఫ్‌, షాదాబ్‌ ఖాన్‌, షహీన్‌ షా అఫ్రిది, హసన్‌ అలీ, ఉసామా మీర్‌.

Highest Century Partnership Batters : దాదా-సచిన్​ టు రోహిత్​-ధావన్​​.. ఈ జోడీలు బరిలో దిగారంటే దద్దరిల్లాల్సిందే!

Nishanth Saranu Pakistan Net Bowler : పాకిస్థాన్ నెట్​ సెషన్స్​లో హైదరాబాదీ ప్లేయర్​.. ఈ 7 అడుగుల కుర్రాడు వెరీ స్పెషల్!

ABOUT THE AUTHOR

...view details