తెలంగాణ

telangana

Pak vs Nz: పాక్​కు క్రికెట్ కష్టాలు మళ్లీ మొదలు..?

By

Published : Sep 18, 2021, 7:10 AM IST

ఇప్పుడిప్పుడే దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తుపై ఎంతో ఆశతో ఉన్న పాకిస్థాన్​కు(Pak vs Nz) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాక్​ పర్యటనను న్యూజిలాండ్‌(Pak vs Nz) భద్రత కారణాలతో రద్దు చేసుకుంది. ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే ఆ జట్టు ఈ నిర్ణయం తీసుకుంది.

Pak vs Nz
పాకిస్థాన్ క్రికెట్

దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ పునరుద్ధరణ మొదలైన నేపథ్యంలో సంతోషంగా ఉన్న సమయంలో పాకిస్థాన్‌కు(Pak vs Nz).. భద్రత కారణాలతో న్యూజిలాండ్‌.. ఆ దేశంలో పర్యటనను రద్దు చేసుకోవటం చాలా పెద్ద దెబ్బే. 2009లో లాహోర్‌లో గదాఫీ స్టేడియానికి వెళ్తుండగా శ్రీలంక జట్టుపై దాడి జరిగిన తర్వాత పాకిస్థాన్‌కు(Pakistan Cricket Match) అంతర్జాతీయ జట్లు వెళ్లడం మానేశాయి.

ఆ తర్వాత తాను ఆతిథ్యమివ్వాల్సిన సిరీస్‌లను పాకిస్థాన్‌ చాలా వరకు యూఏఈలో ఆడింది. అయితే పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు(పీసీబీ) గట్టిగా కృషి చేయటం కారణంగా గత కొన్నేళ్లలో పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు కాస్త ఊపొచ్చింది.

యూఏఈలోనే..

2017లో పాకిస్థాన్‌లో పీఎస్‌ఎల్‌ ఫైనల్‌ తర్వాత.. శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా జట్లు ఆ దేశంలో పర్యటించాయి. 2019 పీఎస్‌ఎల్‌ అంతా పాకిస్థాన్‌లో జరిగింది. 2019లో పాక్‌లో శ్రీలంక టెస్టు సిరీస్‌ ఆడటంతో పీసీబీ ఆత్మవిశ్వాసం పెరిగింది.

ఇకపై తాము ఆతిథ్యమివ్వాల్సిన సిరీస్‌లన్నింటినీ యూఏఈ నుంచి పాకిస్థాన్‌కు(Pakistan Cricket Match) తరలించాలని భావించింది. కానీ ఇప్పుడు న్యూజిలాండ్‌ నిర్ణయంతో పాకిస్థాన్‌(Pak vs Nz) ప్రయత్నాలకు గట్టి దెబ్బ తగిలినట్లయింది.

ఇదీ చదవండి:చివరి నిమిషంలో పాక్-కివీస్ సిరీస్ రద్దు

ABOUT THE AUTHOR

...view details