ETV Bharat / sports

చివరి నిమిషంలో పాక్-కివీస్ సిరీస్ రద్దు

author img

By

Published : Sep 17, 2021, 3:32 PM IST

Updated : Sep 17, 2021, 3:49 PM IST

పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్(new zealand pakistan tour) రద్దయింది. భద్రతాపరమైన కారణాల వల్ల మ్యాచ్​ ప్రారంభమయ్యే కొద్ది నిమిషాల ముందు ఈ నిర్ణయం తీసుకుంది కివీస్ యాజమాన్యం.

Pakistan vs New Zealand
పాకిస్థాన్

న్యూజిలాండ్​ జట్టుతో స్వదేశంలో 3 వన్డే, 5 టీ20ల సిరీస్​కు సిద్ధమైంది పాకిస్థాన్(new zealand pakistan tour). సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ పర్యటన జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా మొదటి వన్డేకు రావల్పిండి వేదికైంది. ఈ మ్యాచ్​ నేడు (సెప్టెంబర్ 17) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే భద్రతాపరమైన కారణాల దృష్ట్యా టాస్​కు కొన్ని నిమిషాల ముందు మొత్తం పర్యటననే నిలిపివేశారు. దీనిపై కివీస్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.

"న్యూజిలాండ్ సెక్యూరిటీ విభాగం సూచన మేరకు పర్యటన రద్దు చేసుకుంటున్నాం. ఈ సిరీస్ రద్దవ్వడం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై పెద్ద ప్రభావం చూపిస్తుందని తెలుసు. పీసీబీ అద్భుతంగా ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని న్యూజిలాండ్ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్​ తెలిపారు.

Last Updated : Sep 17, 2021, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.