తెలంగాణ

telangana

కివీస్​తో టెస్టు సిరీస్​కు రాహుల్ దూరం.. సూర్యకుమార్​కు అవకాశం

By

Published : Nov 23, 2021, 4:16 PM IST

Updated : Nov 23, 2021, 5:28 PM IST

న్యూజిలాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్(IND vs NZ Test series)​కు దూరమయ్యాడు ఓపెనర్ కేఎల్ రాహుల్. ఇతడి స్థానంలో యువ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్​ను జట్టులోకి తీసుకున్నారు.

KL Rahul
రాహుల్

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌(IND vs NZ Test series)కు ముందు భారత్‌కు గట్టి ఎదురు దెబ్బతగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయంతో ఈ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. టీమ్‌ఇండియా బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌(kl rahul injury update) గాయంతో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడని ట్వీట్ చేసింది. ఎడమ తొడ కండరాల సంబంధిత గాయంతో కేఎల్‌ రాహుల్ బాధపడుతున్నట్లు వెల్లడించింది. నవంబర్‌ 25 నుంచి కాన్పూర్‌ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

కివీస్‌తో తొలి టెస్టుకు కేఎల్‌ రాహుల్‌ గైర్హాజరు నేపథ్యంలో మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. అలానే రాహుల్‌కు బదులు సూర్యకుమార్‌ యాదవ్‌కు జట్టులో స్థానం దక్కింది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తే మాత్రం.. రహానె, శ్రేయస్‌, వృద్ధిమాన్‌తో కలిసి భాగస్వామ్యాలు నిర్మించాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌ పర్యటనకు టీమ్‌ఇండియా జట్టుతోపాటు వెళ్లిన సూర్యకుమార్‌కు తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు మళ్లీ టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. విరాట్‌ కోహ్లీ విశ్రాంతి నేపథ్యంలో తొలి టెస్టుకు అజింక్యా రహానె సారథ్యం వహిస్తుండగా.. ఛెతేశ్వర్‌ పుజారా వైస్‌కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

India Squad for New Zealand 2021 Test Series

అజింక్యా రహానె (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్‌ పుజారా (వైస్‌ కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్‌ అయ్యర్, వృద్ధిమాన్‌ సాహా (వికెట్ కీపర్‌), కేఎస్ భరత్‌ (వికెట్ కీపర్‌), రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్‌ పటేల్, జయంత్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్ యాదవ్‌, సిరాజ్‌, ప్రసిధ్‌ కృష్ణ

Last Updated : Nov 23, 2021, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details