తెలంగాణ

telangana

'యాషెస్​లో తప్పిదాలు.. రూట్​ కెప్టెన్​గా తప్పుకోవాలి'

By

Published : Jan 1, 2022, 7:29 PM IST

Joe Root Ashes: యాషెస్​ సిరీస్​ కోల్పోవడం కారణంగా ఇంగ్లాండ్​ కెప్టెన్ జో రూట్​పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అతడు సారథిగా తప్పుకోవాలని ఆ దేశ మాజీ క్రికెటర్ మైఖేల్ అథర్టన్ అన్నాడు.

Joe Root
The Ashes

Joe Root Ashes: యాషెస్‌ సిరీస్‌ను ఇంగ్లాండ్‌ ఓడిపోవడం వల్ల ఆ జట్టు సారథి జో రూట్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే ఆసీస్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో జో రూట్‌ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో సిరీస్‌ ఓటమికి రూట్‌ బాధ్యత వహించాలని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌, కెప్టెన్‌ మైఖేల్‌ అథర్టన్‌ విమర్శించాడు. అలాగే, యాషెస్ ఓటమికి ప్రధాన కోచ్ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ కూడా బాధ్యుడేనని వ్యాఖ్యానించాడు.

"యాషెస్‌ సిరీస్‌కు జట్టును ఎంపిక చేయడం నుంచి ప్రణాళికల వరకు ఎన్నో తప్పులు జరిగాయి. అందుకే సిరీస్‌ ఓటమికి కెప్టెన్‌గా బాధ్యత వహించాలి. రూట్‌ మంచి కెప్టెనే. ఆటగాడిగానూ చాలా బాగా రాణించాడు. ఇంగ్లాండ్‌ టెస్టు క్రికెట్‌కు రాయబారిగా వ్యవహరించాడు. గత ఐదేళ్లు ఎంతో కష్టపడ్డాడు. అయితే ఆసీస్‌లో యాషెస్‌ సిరీస్‌లో మాత్రం సారథ్య పరంగా గడ్డుకాలం ఎదుర్కొన్నాడు. అందుకే ఇది మరొకరిని ఎంచుకునే సమయం కావచ్చు. రూట్‌కు ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ సరిపోతాడు" అని మైఖేల్‌ పేర్కొన్నాడు. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్‌ జనవరి 5వ తేదీ నుంచి ఆసీస్‌తో నాలుగో టెస్టులో తలపడనుంది.

ఇదీ చూడండి:ఇంగ్లాండ్ 68 ఆలౌట్.. మైఖేల్ వాన్​పై ట్రోల్స్ వెల్లువ

ABOUT THE AUTHOR

...view details