తెలంగాణ

telangana

'కాస్త బుర్ర వాడు'.. బౌలర్​పై ధోనీ ఫైర్.. ఏమైందంటే?

By

Published : May 2, 2022, 12:44 PM IST

Updated : May 2, 2022, 1:55 PM IST

MS Dhoni angry: ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఎంఎస్ ధోనీ.. ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. ఆదివారం జరిగిన మ్యాచ్​లో ఓ బౌలర్​పై సహనం కోల్పోయాడు! అసలేమైందంటే?

ms dhoni angry
ms dhoni angry

MS Dhoni angry: మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ మరోసారి ఫైర్ అయ్యాడు. ఆదివారం సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో బౌలర్​పై కాస్త చిరాకు పడ్డాడు. విండీస్ వీరుడు, హైదరాబాద్ బ్యాటర్ నికోలస్ పూరన్​ బ్యాటింగ్ చేస్తుండగా.. ముకేశ్ చౌదరి బౌలింగ్​కు వచ్చాడు. ఈ క్రమంలోనే బంతిని లెగ్​సైడ్ సంధించాడు. అది వైడ్​గా వెళ్లింది. ఇది చూసి ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు! ముకేశ్​ను చూస్తూ కొన్ని సంజ్ఞలు చేశాడు. తలకు చేతిని పెట్టి 'కాస్త మెదడు ఉపయోగించు' అని అర్థం వచ్చేలా సూచనలు చేశాడు. ముకేశ్ బౌలింగ్ చేసే సమయంలో ధోనీ.. ఆఫ్ సైడ్ ఫీల్డర్లను మోహరించాడు. అలాంటి ఫీల్డింగ్​ పెట్టుకొని ముకేశ్ బంతిని లెగ్​సైడ్ విసిరిన నేపథ్యంలో ధోనీకి కోపం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫీల్డర్లను చూపిస్తూ.. ఆఫ్​సైడ్ బౌలింగ్ చేయమని మహీ సూచించాడు.

ధోనీ

200 పరుగులకు పైగా లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే బౌలర్లు తమ ఓవర్లలో కనీసం రెండు బంతులైనా సరిగా వేయాలని మ్యాచ్ అనంతరం ధోనీ చెప్పుకొచ్చాడు. 'బౌలర్లను మంచి ప్రదేశంలో బౌలింగ్‌ చేయమని మాత్రమే సూచించా. ఆరు ఓవర్ల తర్వాత స్పిన్నర్లు చాలా బాగా వేశారు. చివర్లో మా బౌలర్లకు ఒకే విషయం చెప్పా. ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు కొట్టినా.. మిగతా రెండు బంతులకు పరుగులేమీ ఇవ్వకుండా ఉంటే మ్యాచ్‌ను గెలిచినట్లేనని' ధోనీ తెలిపాడు.

ఆదివారం జరిగిన మ్యాచ్​లో.. సన్​రైజర్స్​ హైదరాబాద్​పై చెన్నై 13 పరుగుల తేడాతో గెలుపొందింది. 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 189 పరుగులకే పరిమితమైంది ఎస్​ఆర్​హెచ్. ఓపెనర్లు అభిషేక్ శర్మ (39), కేన్ విలియమ్సన్​ (47) రాణించినా.. మిడిలార్డర్​ విఫలమైంది. నికోలస్ పూరన్ (64*) ఒంటరి పోరాటం చేశాడు. కాగా, చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి 4 వికెట్లతో సత్తాచాటాడు. శాంట్నర్, ప్రిటోరియస్ తలో వికెట్ పడగొట్టారు.

ఇదీ చదవండి:IPL 2022: ఆ లెక్క దాటాలంటే లక్ ఉండాలి బాసూ!

Last Updated : May 2, 2022, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details