తెలంగాణ

telangana

విరాట్‌ను పదేళ్లు వెనక్కి తీసుకెళ్లాలి : మైకెల్ వాన్‌

By

Published : May 13, 2022, 8:19 PM IST

Updated : May 13, 2022, 10:50 PM IST

ప్రస్తుత ఐపీఎల్​ సీజన్‌లో విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకెల్‌ వాన్‌ స్పందించాడు. పదేళ్ల కిందట విరాట్ ఎంత స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశాడో.. ఇప్పుడు కూడా అలానే ఆడాలని సూచించాడు.

Virat Kohli
విరాట్ కోహ్లీ

టీ20 లీగ్‌లో ఫామ్‌ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విరాట్‌ కోహ్లీ ప్రస్తుత సీజన్‌లో మూడు సార్లు గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఇప్పటి వరకు బెంగళూరు తరఫున 12 మ్యాచుల్లో 19.64 సగటుతో 216 పరుగులు మాత్రమే చేశాడు. ఇవాళ పంజాబ్‌తో బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే బెంగళూరుకు ప్లేఆఫ్స్‌ బెర్తు దాదాపు ఖరారైనట్లే. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకెల్‌ వాన్‌ స్పందించాడు. పదేళ్ల కిందట విరాట్ ఎంత స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశాడో.. ఇప్పుడు కూడా అలానే ఆడాలని సూచించాడు. తొలి ఓవర్లలో కాస్త కుదురుకోగలిగితే కోహ్లీ భారీ స్కోర్లను చేయగలడని అభిప్రాయపడ్డాడు.

"విరాట్ కోహ్లీని బెంగళూరు కెప్టెన్‌ డుప్లెసిస్ పదేళ్ల వెనక్కి తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నా. ఇప్పుడున్న ప్రొఫైల్‌ లేని రోజులు అవి. బ్యాటింగ్‌లో అద్భుతాలు సృష్టించిన సమయమది. మంచి ఫామ్‌లో ఉండి టాప్‌ బ్యాటర్‌గా ఎదుగుతున్న కోహ్లీని మళ్లీ చూడాలని ఉంది. ఇప్పటి వరకు ఏం చేశామనేది మరిచిపోవాలి. నీ వయసు గురించి ఆలోచించకూడదు. మంచి ఆరంభం లభిస్తే మాత్రం కోహ్లీని ఆపడం ఎవరి తరమూ కాదు. ఒకవేళ కోహ్లీ 35 పరుగులు వరకు చేస్తే భారీ స్కోర్లుగా మలుస్తాడు. తొలి పది ఓవర్లలో కుదురుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాడు. దానిని అధిగమించి గతంలో మాదిరిగా ఆడితే డేంజరస్‌ బ్యాటర్‌ అవుతాడు" అని వాన్‌ వివరించాడు. ప్రస్తుత సీజన్‌లో విరాట్ కోహ్లీ ఒకే ఒక అర్ధ శతకం (53 బంతుల్లో 58 పరుగులు) సాధించాడు. టీ20 చరిత్రలోనే ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు (973) చేసిన ఏకైక బ్యాటర్‌ విరాట్ కోహ్లీనే కావడం విశేషం.

ఇదీ చదవండి:ప్లే ఆఫ్స్​కు ముందు కోల్​కతాకు షాక్​.. గాయంతో కీలక ప్లేయర్ దూరం

Last Updated : May 13, 2022, 10:50 PM IST

ABOUT THE AUTHOR

...view details