ప్లే ఆఫ్స్​కు ముందు కోల్​కతాకు షాక్​.. గాయంతో కీలక ప్లేయర్ దూరం

author img

By

Published : May 13, 2022, 2:14 PM IST

Cummins' IPL stint over

kolkata knight riders: ఐపీఎల్ కీలక దశకు చేరుకున్న సమయంలో కోల్​కతా నైట్ రైడర్స్​కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ప్లేయర్ టోర్నీలోని మిగతా మ్యాచ్​లకు దూరమయ్యాడు. గాయం కారణంగా స్వదేశం పయనమయ్యాడు. మరోవైపు దిల్లీ ప్లేయర్ పృథ్వీ షా కూడా జట్టుకు దూరమయ్యాడు.

Pat Cummins: ఐపీఎల్​లో కోల్​కతా నైట్ రైడర్స్​కు భారీ షాక్ తగిలింది. ప్లే ఆఫ్స్ దగ్గరపడుతున్న తరుణంలో ఆ జట్టు కీలక ప్లేయర్​ ప్యాట్​ కమిన్స్ టోర్నీకి దూరమయ్యాడు. తొంటి గాయం కారణంగా అతడు మిగతా మ్యాచ్​లకు అందుబాటులో ఉండటం లేదు. గాయం నుంచి త్వరగా కోలుకునేందుకు స్వదేశం ఆస్ట్రేలియా వెళ్తున్నాడు. ఫ్లే ఆప్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా అన్ని మ్యాచుల్లో గెలావాల్సిన కేకేఆర్​కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.

Cummins' IPL stint over
కోల్​కతాకు షాక్

IPL 2022: కమిన్స్ ఈ సీజన్​లో బౌలింగ్​లోనే కాకుండా బ్యాంటింగ్​లోనూ అదరగొడుతున్నాడు. ముంబయితో మ్యాచ్​లో మెరుపు ఇన్నింగ్స్​ ఆడి 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. కీలక సమయంలో వికెట్లు పడగొడుతున్నాడు. కమిన్స్ రూ.7.25కోట్లు పెట్టి కొనుగోలు చేసింది కోల్​కతా. అతిని సేవలను చక్కగా వినియోగించుకుంటోంది. ఇప్పుడు అతని స్థానాన్ని భర్తీ చేయడం జట్టు యాజమాన్యానికి సవాల్​తో కూడుకున్న పనే.

Cummins' IPL stint over
కోల్​కతాకు షాక్

ఆస్ట్రేలియా జట్టు వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనుంది. గాయం నేపథ్యంలో టీ20 సిరీస్​కు అతన్ని దూరంగా ఉంచించి జట్టు యాజమాన్యం. వన్డేలు, టెస్టులకు అతను అందుబాటులో ఉంటాడని భావిస్తోంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కమిన్స్​కు కనీసం 15 రోజుల సమయం పట్టనుందని తెలుస్తోంది. కమిన్స్ ఇప్పుడు ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్​గానూ వ్యవహరిస్తున్నాడు.

దిల్లీకీ కూడా..: భారత టీ20 లీగ్‌ కీలక దశకు చేరుకున్న సమయంలో.. దిల్లీ జట్టుకు కూడా భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ పృథ్వీ షా అనారోగ్యం బారినపడ్డాడు. దీంతో లీగ్‌ స్టేజ్‌లో ఆ జట్టు ఆడాల్సిన మిగతా రెండు ముఖ్యమైన మ్యాచ్‌లకు దూరంకానున్నాడు. షా కొద్ది రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆ జట్టు సహాయక కోచ్‌ షేన్‌ వాట్సన్‌ తాజాగా మీడియాకు వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే అతడు మిగిలిన మ్యాచ్‌లకు ఆడలేడని చెప్పాడు.

'షాకు ఏం జరిగిందో నాకు స్పష్టమైన సమాచారం లేదు. అయితే, కొద్ది రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడు. అతడెంతో నాణ్యమైన ఆటగాడు‌. ప్రపంచ శ్రేణి బౌలర్లపై ఆధిపత్యం చలాయించగల బ్యాట్స్‌మన్‌. అలాంటి ఆటగాడు లేకపోవడం మా జట్టుకు తీరని నష్టం. అతడు త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నా. అయితే, లీగ్‌ స్టేజ్‌లో మాకు మిగిలిన రెండు మ్యాచ్‌లకు మాత్రం అందుబాటులో ఉండడు' అని వాట్సన్‌ పేర్కొన్నాడు. అయితే, అతడు టైఫాయిడ్‌ బారిన పడ్డాడని కెప్టెన్‌ రిషభ్ పంత్‌ తెలిపాడు.

కాగా, షా ఈ సీజన్‌లో చివరిసారి మే 1న లఖ్‌నవూతో దిల్లీ తలపడిన మ్యాచ్‌లో ఆడాడు. ఆ తర్వాత జ్వరం బారిన పడటంతో.. హైదరాబాద్‌, చెన్నై, రాజస్థాన్‌ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో పాల్గొనలేదు. ఈ క్రమంలోనే దిల్లీ ప్రస్తుతం 12 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలుపొంది ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తోంది. అయితే, ఇతర జట్లు కూడా పోటీలో ఉండటంతో దిల్లీ మెరుగైన రన్‌రేట్‌ సాధిస్తేనే ప్లేఆఫ్స్‌ చేరుకునే వీలుంది. ఈ నేపథ్యంలో పృథ్వీ లాంటి డాషింగ్‌ ఓపెనర్‌ మిగతా రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు ఇబ్బందికరమే. ఇక పృథ్వీ ఈ సీజన్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో 28.78 సగటుతో 259 పరుగులు చేశాడు. అందులో రెండు అర్థశతకాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: ముంబయి, చెన్నై లేకుండానే ప్లే ఆఫ్స్​​.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.