తెలంగాణ

telangana

KKR Vs PBKS: మెరిసిన అయ్యర్​.. పంజాబ్​ లక్ష్యం 166

By

Published : Oct 1, 2021, 9:21 PM IST

Updated : Oct 1, 2021, 9:51 PM IST

ఐపీఎల్​లో(IPL 2021) శుక్రవారం జరుగుతోన్న మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్(KKR Vs PBKS)​ బ్యాట్స్​మన్​ వెంకటేశ్​ అయ్యర్​​ హాఫ్​సెంచరీతో అదరగొట్టాడు. అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన కేకేఆర్​ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు నమోదు చేసింది. ఫలితంగా గెలుపు కోసం పంజాబ్​ కింగ్స్​ 166 పరుగులు చేయాల్సిఉంది.

IPL Live Score 2021, KKR vs PBKS: Punjan Kings Need _ Runs To Win
KKR Vs PBKS: మెరిసిన అయ్యర్​.. పంజాబ్​ లక్ష్యం 166

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(KKR Vs PBKS) నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (67) అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. రాహుల్ త్రిపాఠి (34) రాణించాడు. నితీశ్‌ రాణా (31) దూకుడుగా ఆడాడు. శుభ్‌మన్‌ గిల్‌ (7) మరోసారి నిరాశ పరిచాడు. అర్ష్‌ దీప్ సింగ్‌ వేసిన మూడో ఓవర్లో బౌల్డయి పెవిలియన్‌ చేరాడు.

కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (2), టిమ్ సీఫర్ట్‌ (2) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. మహమ్మద్‌ షమీ వేసిన 16 ఓవర్లో మోర్గన్‌ ఎల్బీగా వెనుదిరుగగా.. 18వ ఓవర్లో సీఫర్ట్‌ రనౌటయ్యాడు. దినేశ్‌ కార్తిక్‌ (11) ధాటిగా ఆడలేకపోయాడు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌ దీప్ సింగ్‌ మూడు, రవి బిష్ణోయ్‌ రెండు, మహమ్మద్‌ షమి ఒక వికెట్‌ తీశారు.

ఇదీ చూడండి..IPL 2021 News: టాస్ గెలిచిన పంజాబ్.. కోల్​కతా బ్యాటింగ్

Last Updated : Oct 1, 2021, 9:51 PM IST

ABOUT THE AUTHOR

...view details