తెలంగాణ

telangana

కోహ్లీ x ధోనీ.. రికార్డులు బద్దలు కొట్టేదెవరో?.. టాస్​ ఎవరు గెలిచారంటే?

By

Published : Apr 17, 2023, 7:02 PM IST

Updated : Apr 17, 2023, 10:01 PM IST

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా బెంగళూరు, చెన్నై జట్ల మధ్య మ్యాచ్​ ప్రారంభమైంది. అందులో భాగంగా టాస్​ ఎవరు గెలిచారంటే?

IPL 2023 Royal Challengers Bangalore vs Chennai Super Kings
IPL 2023 Royal Challengers Bangalore vs Chennai Super Kings

ఐపీఎల్‌లో ఆసక్తికర సమరం జరుగుతోంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య ఉత్కంఠ పోరు ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్‌ మొదలైంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన బెంగళూరు.. బౌలింగ్‌ ఎంచుకుంది. ఇరుజట్లు గతంలో 30 సార్లు తలపడగా.. చెన్నై 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ సీజన్‌లో జట్ల ప్రదర్శనను చూస్తే.. రెండు సమంగా నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండింట్లో గెలిచి 2 మ్యాచుల్లో ఓడిపోయాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో.. చెన్నై ఆరో స్థానంలో, బెంగళూరు ఏడో ప్లేస్​లో నిలిచాయి.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎమ్ఎస్​ ధోనీ(కెప్టెన్/వికెట్​ కీపర్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్​ కీపర్​), హర్షల్ పటేల్, వనిందు హసరంగా, వేన్ పార్నెల్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్

కోహ్లీ x ధోనీ.. రికార్డులు బద్దలు గొట్టేదెవరో?
బెంగళూరు, చెన్నై ఆసక్తికర మ్యాచ్​లో టీమ్​ఇండియా మాజీ కెప్టెన్లు విరాట్​ కోహ్లీ, మహేంద్ర సింగ్​ ధోనీ భారీ రికార్డులపై కన్నేశారు. విరాట్​ ఇంకో 21 పరుగులు చేస్తే.. శిఖర్​ ధావన్​ తర్వాత 1000 పరుగుల మార్కును అందుకున్న ప్లేయర్​గా నిలుస్తాడు. ఇక, ఎమ్​ఎస్​​ ధోనీ మరో 2 పరుగులు బాదితే.. ఆర్​సీబీపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా.. డేవిడ్​ వార్నర్​ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు.

ఇలా చేస్తేనే విజయం : ధోనీ
"ఈ స్టేడియంలో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లను కట్టడి చేయడం కష్టం. అందుకే టాస్​ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో తేమగా ఉంటుంది. ఈ పిచ్​పై బహుశా 180-200 స్కోరు నమోదు కావచ్చు. అయితే, ఎంత స్కోర్ చేయగలం, ఎంత చేస్తాము అన్న దానిపై మేము ప్రతి 3-4 ఓవర్లకు ఒకసారి.. సమీక్షించుకోవాలి. మెత్తం ఒకసారి ప్లాన్​ చేసుకోవడం కంటే.. ఇలా గ్రౌండ్​ లెవెల్​లో పరిస్థితిని సమీక్షించుకుంటే విజయం వరిస్తుంది. మా జట్టులో ఒక మార్పు జరిగింది. గాయపడ్డ మగాలా​ స్థానంలో మరో ప్లేయర్ పతిరణ వచ్చాడు. ఇందులో మంచి విషయం ఏంటంటే.. అలా వెళ్లిన వాళ్ల స్థానంలో వచ్చిన వాళ్లందరూ మంచి ప్రదర్శన చేశారు. అయితే, గాయాల కావడం దురదృష్టకరం"

180-200 స్కోర్​ చేయాలి : ఫాఫ్ డు
"మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. పిచ్‌ స్వభావం మారుతుందని నేను భావిస్తున్నాను. ఆలా చేయాలంటే 180-200 స్కోర్​ మంచి టార్గెట్​. ఇది చాలా చిన్న మైదానం, బంతి మంచిగా ట్రావెల్ చేస్తుంది. పిచ్​ సర్ఫేస్​ కుడా బాగుంది. కానీ కొంచెం తేమ ఉండటం సహాయపడుతుంది. మా తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్​ను ఉపయోగించుకునే అవకాశం ఉంది"

Last Updated : Apr 17, 2023, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details