తెలంగాణ

telangana

ఐపీఎల్​ 2021: బరిలో దిగితే రికార్డులే!

By

Published : Apr 9, 2021, 1:08 PM IST

Updated : Apr 9, 2021, 4:43 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​) ప్రారంభానికి రంగం సిద్ధమైంది. నేడు చెన్నై వేదికగా జరగనున్న తొలి మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో డిఫెండింగ్​ ఛాంపియన్స్​ ముంబయి ఇండియన్స్​ తలపడనుంది. అయితే ప్రతి సీజన్​లో ఆటగాళ్లు ఏదో ఒక రికార్డును నెలకొల్పుతున్న నేపథ్యంలో ఈసారి ఏఏ రికార్డులు సాధించే అవకాశం ఉందో తెలుసుకుందాం.

IPL Statistical Preview
ఐపీఎల్​ 2021లో సాధించనున్న సరికొత్త రికార్డులివే!

క్రికెట్​ ప్రేమికులు ఎంతోగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) ప్రారంభానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం (ఏప్రిల్​ 9) నుంచి టోర్నీ మొదలుపెట్టేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. టోర్నీలో భాగంగా నేడు చెన్నై వేదికగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, ముంబయి ఇండియన్స్​ జట్లు తలపడనున్నాయి.

ఈ మ్యాచ్​లో డిఫెండింగ్​ ఛాంపియన్స్​ ముంబయి.. మరోసారి ట్రోఫీని దక్కించుకునేందుకు ఫేవరేట్​గా బరిలో దిగనుంది. ప్రస్తుత సీజన్​లో ఇద్దరు యువ క్రికెటర్లు కెప్టెన్​గా బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా గతేడాది జరిగిన సీజన్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టుకు మధ్యలో సారథ్యం వహించిన ఇయాన్ మోర్గాన్​ ఈసారి పూర్తి సీజన్​కు కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్​ చరిత్రలో ప్రతిసీజన్​లో ఏవో సరికొత్త రికార్డులను నెలకొల్పే మన క్రికెటర్లు.. ఈసారి ఎలాంటి ఘనతలు సాధించనున్నారో పరిశీలిద్దాం.

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో నమోదు కానున్న రికార్డులు..

5-ఐపీఎల్​ చరిత్రలో కెప్టెన్​గా వ్యవహరిస్తున్న ఐదో అత్యంత పిన్న వయస్కుడిగా దిల్లీ క్యాపిటల్స్​ సారథి రిషబ్​ పంత్​ నిలిచాడు. విరాట్​ కోహ్లీ, స్టీవ్​ స్మిత్​, సురేశ్​ రైనా, శ్రేయస్​ అయ్యర్​.. పంత్​ కంటే తక్కువ వయసులోనే కెప్టెన్లుగా వ్యవహరించారు.

5-ఐపీఎల్​ చరిత్రలో వరుసగా ఐదు సార్లు ప్లేఆఫ్స్​కు అర్హత సాధించిన జట్టు సన్​రైజర్స్ హైదరాబాద్​. 2016 సీజన్​లో ఈ జట్టు విజేతగా నిలవగా.. 2018లో రన్నరప్​తో సరిపెట్టుకుంది.

2014-పంజాబ్​ కింగ్స్ జట్టు కేవలం 2014 సీజన్​లోనే ప్లేఆఫ్స్​కు చేరింది. ఫైనల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టుపై పరాజయాన్ని చవిచూసి ఇంటిముఖం పట్టింది.

6000-ఐపీఎల్​లో స్టార్​ బ్యాట్స్​మెన్​ విరాట్​ కోహ్లీ, సురేశ్​ రైనా, డేవిడ్​ వార్నర్​, రోహిత్​ శర్మ ప్రస్తుత సీజన్​లో 6 వేల పరుగుల మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఆర్సీబీ కెప్టెన్​ కోహ్లీ అందరికంటే ముందున్నాడు.

ఆటగాడు ఇన్నింగ్స్​ రన్స్ సగటు స్ట్రైక్​ రేట్
విరాట్​ కోహ్లీ 184 5878 38.16 130.73
సురేశ్​ రైనా 189 5368 33.34 137.14
డేవిడ్​ వార్నర్ 142 5254 42.71 141.54
రోహిత్​ శర్మ 195 5230 31.31 130.61
శిఖర్​ ధావన్​ 175 5197 34.41 126.87

8-ఆర్సీబీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఐపీఎల్​లో ఇప్పటివరకు 192 మ్యాచ్​లు(ఒకే జట్టులో) ఆడాడు. ప్రస్తుత సీజన్​లో మొదటి నుంచి ఒకే జట్టులో ఉండి 200 మ్యాచ్​లు ఆడిన మైలురాయిని విరాట్​ చేరుకునే అవకాశం ఉంది. కోహ్లీ కంటే ముందు సీఎస్కే కెప్టెన్​ ధోనీ, ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ ఈ ఘనతను సాధించినా.. వీరిద్దరూ ఐపీఎల్​లో రెండు టీమ్​లకు ప్రాతినిధ్యం వహించారు.

349-ఐపీఎల్​ కెరీర్​లో క్రిస్​ గేల్​ ఇప్పటివరకు 349 సిక్సర్లు బాదాడు. టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో గేల్ అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుత ఐపీఎల్​లో మరో సిక్సర్​ కొడితే మొత్తంగా 350 సిక్సర్ల మైలురాయికి చేరుకునే అవకాశం ఉంది.

ఆటగాడు ఇన్నింగ్స్ పరుగులు సగటు సిక్సర్లు
క్రిస్​ గేల్​ 131 4772 41.13 349
ఏబీ డివీలియర్స్ 156 4849 40.4 235
ఎమ్​ఎస్​ ధోనీ 182 4632 40.99 216
రోహిత్​ శర్మ 195 5230 31.31 213
విరాట్​ కోహ్లీ 184 5878 38.16 201

591-ఐపీఎల్​లో అత్యధిక బౌండరీలు బాదిన బ్యాట్స్​మన్​గా శిఖర్​ ధావన్​ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరో 9 ఫోర్లు కొడితే టోర్నీలో 600 ఫోర్లు కొట్టిన ఏకైక క్రికెటర్​గా ధావన్​ నిలుస్తాడు.

ఆటగాడు ఇన్నింగ్స్ పరుగులు సగటు 100/50 ఫోర్లు
శిఖర్​ ధావన్ 175 5197 34.41 2/41 591
డేవిడ్​ వార్నర్ 142 5254 42.71 4/48 510
విరాట్​ కోహ్లీ 184 5878 38.16 5/39 503
సురేశ్​ రైనా 189 5368 33.34 1/38 493
గౌతమ్ గంభీర్​ 152 4217 31.23 0/36 491

6.24-ఐపీఎల్​ చరిత్రలో అతి తక్కువ ఎకానమీ నమోదు చేసిన బౌలర్​గా సన్​రైజర్స్ హైదరాబాద్​ స్పిన్నర్​ రషీద్​ ఖాన్​ నిలిచాడు. 6.24 ఎకానమీతో ఒకే సీజన్​లో అత్యధికంగా 21 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత సీజన్​లో సన్​రైజర్స్​ జట్టుకు రషీద్ కీలకం కానున్నాడు.

ఇదీ చూడండి:ఐపీఎల్​లో అత్యధిక క్యాచ్​ల ఆటగాళ్లు వీరే

Last Updated : Apr 9, 2021, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details